భద్రాచలంటౌన్: ఆదివాసీల సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతోంది. భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ మరింత చొరవ చూపుతున్నారు. విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించి మెరుగైన ఫలితాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివాసీల ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా భద్రాచలంలో గిరిజన మ్యూజి యం ఏర్పాటు చేశారు. అటవీ, సంప్రదాయ ఉత్పత్తులతోపాటు నిత్యావసరాల అమ్మకానికి భద్రిగిరి మార్టును అందుబాటులోకి తేగా, సత్ఫలితాలు వస్తున్నాయి.
ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి అంటే మౌలిక వసతులు కల్పించడం మాత్రమే కాదు. వారి జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి. ఆదివాసీ సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించేలా గిరిజన మ్యూజియం ఏర్పాటు చేశాం.
–బి.రాహుల్, ఐటీడీఏ పీఓ, భద్రాచలం


