●ఆకట్టుకునే కొమ్ము నృత్యం | - | Sakshi
Sakshi News home page

●ఆకట్టుకునే కొమ్ము నృత్యం

Aug 9 2026 1:40 AM | Updated on Aug 9 2026 1:40 AM

ఆదివాసీ సంప్రదాయ కొమ్మునృత్యం నేడు యువతకు ఉపాధిగా మారింది. కొమ్ము పాగా ధరించి డోలు వాయిస్తూ లయబద్ధంగా చేసే నృత్యం ఆకట్టుకుంటుంది. ఇద్దరు నృత్యకారులు ఎగురుతూ ధరించిన కొమ్ములతో ఢీ కొట్టే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. దీన్నే రేలా నృత్యం అని కూడా పిలుస్తారు. పురుషులు అడవి దున్న లేదా ఎద్దు కొమ్ములతో తయారు చేసిన ప్రత్యేకమైన కిరీటాన్ని తలకు ధరిస్తారు. శరీరంపై నెమలి ఈకలు, వర్ణరంజితమైన దుస్తులు, చేతిలో డప్పు (తుడుము) కనిపిస్తాయి. తొలుత ఆదివాసీ గ్రామాల్లోనే ప్రదర్శించే ఈ నృత్యం ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యక్రమాలు, శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలలో, ప్రముఖుల పర్యటనల్లో ప్రదర్శిస్తున్నారు. దీంతో కొందరు ఆదివాసీ యువకులు సంస్కృతిని కాపాడుకుంటూనే కొమ్ము నృత్యంతో ఉపాధి పొందుతున్నారు. గొత్తికోయ గిరిజన గ్రామాల్లో మూల ఆదివాసీ సంక్షేమ సంఘం (మాస్‌ ), గిరిజన పెద్దలు కలిసి ఆదివాసీ పల్లెల్లో డీజేలను వినియోగించొద్దని నిర్ణయించుకున్నారు. సంప్రదాయ నృత్యాలను ప్రోత్సహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement