పాల్వంచ/పాల్వంచరూరల్/బూర్గంపాడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మారాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషా స్పష్టం చేశారు. సీపీఐ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర మూడో రోజు శనివారం బూర్గంపాడు మండలంతోపాటు పాల్వంచ మండలంలోని రంగాపురం, జగన్నాథపురం, కేశవాపురం, నాగారంకాలనీ, పునుకుల, కోడిపుంజులవాగు, కిన్నెరసాని, మొండికట్ట, ఉల్వనూరు, చండ్రాలగూడెం నుంచి పాల్వంచ బస్టాండ్ వరకు సాగింది. అక్కడి నుంచి రాజీవ్‌గాంధీమార్కెట్, శాసీ్త్రరోడ్ వరకు ర్యాలీ నిర్వహించగా.. సాబీర్‌పాషా మాట్లాడారు. పాల్వంచ ప్రాంత అస్థిత్వాన్ని, ప్రజల హక్కులను కాపాడి, పూర్వవైభవం తీసుకురావడానికి పోరాటాలు నిర్వహిస్తామన్నారు. సర్వే నంబర్‌లు 444, 817, 727, 999, 410లలో స్థలాల క్రమబద్ధీకరణ కోసం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రత్యేక చొరవ చూపించడంతో సర్వే ప్రారంభమైందన్నారు. కేటీపీఎస్ పరిధిలో 800 మెగావాట్ల రెండు విద్యుత్ ప్లాంట్లు తెచ్చి పూర్వవైభవం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అటవీ హక్కులు, ఉపాధి హామీ చట్టాలను కేంద్రం నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తోందని, కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చి అదానీ, అంబానీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, పోరాటాలతో తిప్పికొట్టాలని కోరారు. మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1న నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మేయర్ మూడ్ గణేశ్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, నరాటి ప్రసాద్, వీసంశెట్టి పూర్ణచందర్‌రావు, పుల్లారెడ్డి, అడుసుమల్లి సాయిబాబు, ఉప్పుశెట్టి రాహుల్, అన్నారపు వెంకటేశ్వర్లు, నిమ్మల రాంబాబు, ఇట్టి వెంకట్రావు, సారెడ్డి పుల్లారెడ్డి, మున్న లక్ష్మీకుమారి, మువ్వ వెంకటేశ్వర్లు, పేరాల శ్రీనివాస్, సప్కా నాగేశ్వరరావు, నలజాల సత్యనారాయణ, ముదిగొండ బాలకృష్ణ, వీవీబీ చారి, బర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సీపీఐ ప్రజా చైతన్యయాత్రలో నాయకులు


