●రెండు రోజులుగా రోగుల అవస్థలు
చుంచుపల్లి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రెండు రోజులుగా ల్యాబ్ సేవలు నిలిచి పోయాయి. నీటి సరఫరా నిలిచిపోవడంతో గురు, శుక్రవారాల్లో రక్త పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేశారు. ల్యాబ్‌లో పరీక్షల నిర్వహణ, పరికరాల శుభ్ర త, నమూనాల ప్రాసెసింగ్‌కు అవసరమైన నీరు అందుబాటులో లేకపోవడంతో పరీక్షలు చేపట్టలేకపోయారు. రక్త పరీక్షల కోసం వచ్చిన గర్భిణులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరీక్ష ల ఫలితాలపై ఆధారపడే వైద్య చికిత్సలు కూడా ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉద యం నుంచే రక్త పరీక్షల కోసం వచ్చిన రోగులు గంటల తరబడి వేచి చూసి చివరకు నిరాశతో వెనుదిరిగారు. జీజీహెచ్, ఎంసీహెచ్‌కు వచ్చిన బాధితులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాలను ఆశ్రయించా ల్సి వచ్చింది. అధికారులు స్పందించి ల్యాబ్ సేవలను పునరుద్ధరించాలని కోరుతున్నారు. కాగా, రోజూ ఇక్కడ 1000 మంది బాధితులకు సంబంధించి 1500 నుంచి 2000 వరకు రక్త నమూనాలను పరీక్షిస్తారు. బోరు మరమ్మతుల వల్ల సమస్య ఏర్పడిందని, నీటి సరఫరా పునరుద్ధరించగానే ల్యాబ్ సేవలు ప్రారంభిస్తామని ఆస్పత్రి ఆర్‌ఎంఓ చైతన్య తెలిపారు.


