బైక్‌ను ఢీకొట్టిన లారీ.. | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన లారీ..

Aug 8 2026 12:23 AM | Updated on Aug 8 2026 12:23 AM

మైక్రో ఫైనాన్స్‌ వ్యాపారికి తీవ్ర గాయాలు

జూలూరుపాడు: మండలంలోని మాచినేనిపేటతండా జీపీ మర్రిచెట్టుతండా గ్రామ సమీపంలో భద్రాచలం రాష్ట్రీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తూర్పుగోవారి జిల్లా అనపర్తికి చెందిన, మైక్రో ఫైనాన్స్‌ వ్యా పారి కొవ్వూరి చంద్రారెడ్డి కొత్తగూడెం విద్యానగర్‌కాలనీలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. కొన్నేళ్లుగా పరిసర ప్రాంతాల ప్రజలకు ఫైనాన్స్‌ ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన తన కుమారుడితో బైక్‌పై కొత్తగూడెం నుంచి జూలూరుపాడు వైపు వెళ్తుండగా మర్రిచెట్టుతండా సమీపంలోకి రాగానే వెనక వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. చంద్రారెడ్డి తీవ్రంగా గాయపడగా, అతని కుమారుడు క్షేమంగా బయటపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. లారీడ్రైవర్‌ సెల్‌ఫోన్‌ చూస్తూ డ్రైవింగ్‌ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై విచారణ చేపట్టారు.

అనారోగ్యంతో

వ్యక్తి ఆత్మహత్య

దుమ్ముగూడెం: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని పైడిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుర్సం బాలరాజు (32) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గురువారం ఇంట్లో ఉన్న పురుగులమందు తాగగా కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.

మద్యానికి బానిసై ఒకరు..

టేకులపల్లి: ఉరివేసుకుని వ్యవసాయ కూలీ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కోయ గూడెం పంచాయతీ దంతెలతండాలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే భూక్యా కిషన్‌ (40) మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి బాగా మద్యం తాగి ఇంటికి వచ్చిన ఆయన ఇంకా డబ్బులు కావాలని భార్యతో గొడవపడ్డాడు. అందరూ నిద్రపోయిన తర్వాత మద్యం మత్తులోనే శుక్రవారం తెల్లవారుజామున తన ఇంటి ముందు వరండాలోని దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు చందు ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ పి.శ్రీనివాస్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement