696.1 కిలోల గంజాయి దహనం | - | Sakshi
Sakshi News home page

696.1 కిలోల గంజాయి దహనం

Aug 7 2026 12:14 AM | Updated on Aug 7 2026 12:14 AM

తల్లాడ/కొత్తగూడెంఅర్బన్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో సీజ్‌ చేసిన గంజాయిని తల్లాడ మండలం గోపాలపేట ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్‌ (వ్యర్థ పదార్థాల నివారణ పరిశ్రమ)లో దహనం చేశారు. భద్రాద్రి జిల్లాలో పలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 32 కేసులకు సంబంధించి 696.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.3.50 కోట్లు కాగా, ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ వి.సోమిరెడ్డి ఆదేశాలతో గురువారం దహనం చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌.కిషన్‌, కొత్తగూడెం డీపీఈఓ ఎ.శ్రీనివాసరెడ్డి, సీఐ జయశ్రీ, ఎస్‌ఐలు రమేశ్‌, గౌతమ్‌, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement