పాల్వంచరూరల్: వైల్డ్‌లైఫ్ పరిధిలో విద్యుత్‌శాఖ అధికారులు అనుమతులు లేకుండా గిరిజన రైతుల వ్యవసాయ కనెక్షన్ల్‌కోసం వేసిన విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని వైల్డ్‌లైఫ్ శాఖ రేంజర్ కనకమ్మ ఆ శాఖ ఏడీఈ, ఏఈలకు ఇటీవల నోటీసులు జారీ చేశారు. మండలంలోని బంజర గ్రామ పంచాయతీ పరిధిలో ఎస్టీఎఫ్‌సీ స్కీమ్ కింద రెండు నెలల క్రితం ఎన్‌పీడీసీఎల్ అధికారులు 32 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినప్పటికీ కనెక్షన్లు ఇవ్వలేదు. ఈ క్రమంలో అనుమతి లేకుండా వైల్డ్‌లైఫ్ పరిధిలో విద్యుత్ స్తంభాలు ఎలా వేస్తారని, వెంటనే తొలగించాలని వైల్డ్‌లైఫ్ చాతకొండ రేంజర్ కనకమ్మ ఎన్‌పీడీసీఎల్ ఏడీఈ, రూరల్ ఏఈలకు నోటీసులు జారీ చేశారు. వైల్డ్‌లైఫ్ పరిధిలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలంటే ఢిల్లీ బోర్డు నుంచి, స్థానిక వైల్డ్‌లైఫ్ డివిజన్ ద్వారా క్లియరెన్స్ అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, ఐటీడీఏ ద్వారా అనుమతులు ఇచ్చిన తర్వాత స్తంభాలు ఏర్పాట్లు చేశామని ఏఈ రవీందర్ తెలిపారు. విద్యుత్ స్తంభాల నిర్మాణం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో గురువారం ఎన్‌పీడీసీఎల్ ఏడీఈ హుస్సేన్ బంజర గ్రామాన్ని సందర్శించారు. సర్పంచ్, రైతులతో మాట్లాడి విద్యుత్ స్తంభాలు తొలగించాల్సి ఉందని వివరించారు.
విద్యుత్ అధికారులకు వైల్డ్‌లైఫ్
రేంజర్ నోటీసులు


