దుమ్ముగూడెం: మండలంలోని కేశపట్నం సమీపంలోని చిన్ననల్లబల్లి వద్ద గురువారం లారీడ్రైవర్ నిర్లక్ష్యం భారీ ప్రమాదానికి దారితీసింది. స్థానికుల కథనం మేరకు.. మద్యం మత్తులో ఉన్న లారీడ్రైవర్ ఇసుక లోడుతో ఉన్న లారీని వేగంగా నడుపుతూ రోడ్డుకు దూరంగా పార్క్ చేసిన ఆటోను ఢీకొట్టడంతో ధ్వంసమైంది. ఆటోలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని లారీని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
దాడి ఘటనపై కేసు నమోదు
ములకలపల్లి: ప్రైవేట్ సైట్ ఇంజనీర్‌పై దాడికి పాల్పడిన ఘటనలో ఒకరిపై కేసు నమోదైంది. ఎస్‌ఐ మధుప్రసాద్ కథనం మేరకు.. కమలాపురం శివారు సీతారామ పంప్‌హౌస్–3 సమీపంలో ప్యాకేజ్–6లో ఓ కంపెనీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ పనులు సాగుతున్నాయి. అక్కడ సైట్ ఇంజనీర్‌గా తరుణ్ పని చేస్తున్నాడు. ములకలపల్లి శివారుకు చెందిన మహేశ్ గురువారం వర్క్‌సైట్‌కు వెళ్లి తరుణ్‌తో వాగ్వాదానికి దిగాడు. గతంలో తాము చేసిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు చెల్లించాంటూ అడిగాడు. తరుణ్‌పై చేయి చేసుకుని, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. తరుణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


