ఈనెల రెండో వారంలోగా యూనిఫామ్‌ | - | Sakshi
Sakshi News home page

ఈనెల రెండో వారంలోగా యూనిఫామ్‌

Aug 6 2026 12:45 AM | Updated on Aug 6 2026 12:45 AM

ములకలపల్లి: జిల్లాలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌, గురుకులాల విద్యార్థులకు ఈనెల 10వ తేదీలోగా, ఏకలవ్య విద్యార్థులకు 13లోగా ఒక జత యూనిఫామ్‌ అందించాలని అదనపు కలెక్టర్‌ విద్యాచందన సూచించారు. ములకలపల్లి మండలం మూకమామిడిలోని యూనిఫామ్‌ హబ్‌ను బుధవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. ఆతర్వాత గ్రామసమాఖ్య భవన నిర్మాణాన్ని ఆమె పరిశీలించారు. అలాగే, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంతో పాటు పెట్లం గ్రామంలో గ్రామసమాఖ్య నిర్మాణాలు, యూని ఫామ్‌ ెంసటర్లను ఆమె పరిశీలించారు. సర్పంచ్‌ కొర్సా ఆదిలక్ష్మి, ఎంపీడీఓలు సత్యనారాయణ, రాజేశ్వరి, ఈజీఎస్‌ ఏపీఓ హుస్సేన్‌, ఏపీఎం రామ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement