టేకులపల్లి: టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతీ పరిధి హనుమతండాకు చెందిన గుగులోతు శ్రీకాంత్(25) ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కొన్నేళ్లుగా ఖమ్మం కస్నానాయక్ తండాకు చెందిన యువతిని ప్రేమించినట్లు తెలిసింది. ఈక్రమాన యువతి బావలు హాము, సచిన్ బెదిరించడం, యువతి కూడా దూరం కావడంతో శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తల్లి జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గత నెల 21న వారిపై కేసు నమోదు చేసినా ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడంపై బుధవారం మృతుడి తల్లిదండ్రులు రవి, జ్యోతి, బంధువులు టేకులపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోగా ఎస్‌ఐ తిరుపతి, సిబ్బంది వారితో మాట్లాడారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని.. త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్సై నచ్చచెప్పడంతో ఆందోళనను విరమించారు.
పోలీసుస్టేషన్ ఎదుట
యువకుడి కుటుంబీకుల ధర్నా


