ఆలయ మర్యాదలపై అవగాహన తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఆలయ మర్యాదలపై అవగాహన తప్పనిసరి

Aug 6 2026 12:45 AM | Updated on Aug 6 2026 12:45 AM

భద్రాచలం: దేవాదాయ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది దేవస్థానం, ఆలయ మర్యాదలపై తప్పనిసరి అవగాహన కలిగి ఉండాలని స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెంపుల్‌ అడ్మినిస్ట్రేటివ్‌(సీత) డైరెక్టర్‌గా చిలకపాటి విజయరాఘవాచార్యులు పేర్కొన్నారు. ‘సీత’ఆధ్వర్యాన భద్రాచలంలోని అంబసత్రంలో మూడు రోజుల పాటు ఉద్యోగులకు జరగనున్న వర్క్‌షాప్‌ బుధవారం మొదలైంది. ఈ సందర్భంగా విజయరాఘవచార్యులు మాట్లాడుతూ దేవాదాయ శాఖ సిబ్బందికి ప్రభుత్వ పాలన, వ్యవస్థలు, సిబ్బంది కార్యదర్శకత, సంప్రదాయం, ఆగ మ శాస్త్రం, ఆలయ ఆచారాలపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. దేవాలయాల నిర్వహణను ఆధునికంగా, పారదర్శకంగా, శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని చెప్పారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ఈఓ దామోదర్‌రావు మాట్లాడుతూ సుమారు 15ఏళ్ల అనంతరం శిక్షణ పునఃప్రారంభం కావడం సంతోషకరమని తెలిపారు. శిక్షణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల ఉద్యోగులు 120 మంది పాల్గొన్నా రు. ఈ కార్యక్రమంలో ఏఈఓ భవానీ రామకృష్ణ, స్థానాచార్యులు స్థలశాయి, రామాయణ పారాయణదారు ఎస్టీజీ అంతర్వేది కృష్ణమాచార్యులు, అకా డమీ నుంచి శ్రీరామ చక్రదర్‌ పాల్గొన్నారు.

‘సీత’వర్క్‌షాప్‌లో డైరెక్టర్‌ విజయరాఘవులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement