ఇల్లెందు: ఇల్లెందు కోర్టు న్యాయమూర్తి స్వరూప కాటం న్యాయశాస్త్రంలో డాక్టరేట్ సాధించారు. ‘రైట్ టూ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అండర్ ది కాన్‌స్ట్యూషన్ ఆఫ్ ఇండియా’అనే అంశంపై ఆమె సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి డాక్టరేట్ లభించగా, బుధవారం న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ సాధించిన స్వరూప మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థితికి చేరానని తెలిపారు. ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం చదివే సమయాన మూడు బంగారు పతాకాలు సాధించినట్లు వెల్లడించారు. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు.
రూ.5.43 లక్షల విలువైన
గంజాయి స్వాధీనం
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.5.43లక్షల విలు వైన గంజాయి పట్టుబడింది. భద్రాచలం టౌన్ ఎస్‌ఐ రామకృష్ణ ఆధ్వర్యాన ఈనెల 2వ తేదీన రాత్రి తనిఖీ చేస్తుండగా ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని అదుపులోకి తీసుకుని ప్ర శ్నించగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వివేక్ విరాట్‌నాగ్, ఒడిశాకు చెందిన గంజాయి వ్యాపారి నితీష్‌కుమార్‌గా తేలింది. ఈమేరకు హైదరాబాద్ తరలించేందుకు సిద్ధం చేసిన 10.870 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని విరాట్‌నాగ్‌ను అరెస్ట్ చేయగా నితీష్ పరారయ్యాడు.


