9న శాకంబరీ అవతారంలో పెద్దమ్మతల్లి | - | Sakshi
Sakshi News home page

9న శాకంబరీ అవతారంలో పెద్దమ్మతల్లి

Aug 6 2026 12:45 AM | Updated on Aug 6 2026 12:45 AM

పాల్వంచరూరల్‌: మండంలోని కేశవాపురం – జగన్నాధపురం మధ్య కొలువైన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో అమ్మవారు ఈనెల 9న శాకంబరీ అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారి అలంకరణ కోసం కావాల్సిన పండ్లు, వివిధ రకాల కూరగాయలు, పూలను దాతలు వితరణ చేయొచ్చని ఈఓ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఆసక్తి ఉన్న భక్తులు ఈనెల 8వ తేదీ శనివారం నాటికి ఆలయంలో అందజేయాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.

గుండాల గురుకులం ప్రిన్సిపాల్‌కు పదోన్నతి

గుండాల: గుండాల గిరిజన గురుకుల కళా శాల ప్రిన్సిపాల్‌ నారా యణనాయక్‌కు ఆర్‌సీఓగా పదోన్నతి లభించింది. ఏడాది కాలంగా ఆయన ఇక్క డ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈమేరకు నారాయణకు పదోన్నతి కల్పించడమే కాక మహబూబాబాద్‌ ఆర్‌సీఓగా నియమిస్తూ గురుకులాల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఆయన మహబూబాబాద్‌లో బుధవారం బాధ్యతలు స్వీకరించగా, గుండాల కాలేజీ ప్రిన్సిపాల్‌ బాధ్యతలను వైస్‌ ప్రిన్సిపాల్‌ విప్పా సత్యనారాయణకు అప్పగించారు.

నేడు ఆర్‌ఎల్‌సీతో

ఏఐటీయూసీ చర్చలు

రుద్రంపూర్‌: సింగరేణిలో గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ 30 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యాన ఆర్‌ఎల్‌సీ సమక్షాన గురువా రం చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే ఓసారి చర్చలు జరిగినా ఒప్పందం కుదరకపోవడంతో 6వ తేదీన హైదరాబాద్‌లోని ఆర్‌ఎల్‌సీ కార్యాలయంలో రెండోసారి చర్చలు నిర్వహించనున్నారు. ఈ చర్చల్లో ఒప్పందాలు కుదిరితే సమ్మె నోటీసు వెనక్కి తీసుకుంటామని, లేనిపక్షంలో సమ్మె తప్పదని ఏఐటీయూసీ నాయకులు చెబుతున్నారు. కాగా, గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ కార్మికుల సమస్యలపై చాన్నాళ్లు ఉదాసీనంగా వ్యవహరించి, సెప్టెంబర్‌లో కాలపరిమితి ముగుస్తుండగా సమ్మె నోటీసు ఇవ్వడంపై కార్మికుల్లో అనుమానాలు నెలకొన్నా యి. ఏదేమైనా గురువారం నాటి చర్చల్లో 30 డిమాండ్లకు గాను కనీసం 20 సాధించినా ఫర్వాలేదని భావిస్తున్నారు.

మార్షల్‌ ఆర్ట్స్‌లో పతకాలు

రుద్రంపూర్‌: హైదరాబాద్‌లో ఈనెల 1, 2వ తేదీల్లో నిర్వహించిన అంతర్జాతీయ మార్షల్‌ ఆర్ట్స్‌ చాంపియన్‌ షిప్‌లో భారత్‌ తరఫున పాల్గొన్న కొత్తగూడెం సింగరేణి మహిళా జూని యర్‌ కళాశాల విద్యార్థిని భూక్యా శ్రీవిద్య ప్రతి భ కనబరిచింది. ఆమె కరాటే కటాస్‌ విభాగంలో స్వర్ణం, కుమిటే విభాగంలో మరో పతకం సాధించింది. ఈ సందర్భంగా శ్రీవిద్యను సింగరేణి కాలరీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ జనరల్‌ మేనేజర్‌ జి.రాజేంద్రప్రసాద్‌, కరస్పాండెంట్‌ పి.కాంతారావు, ప్రిన్సిపాల్‌ టి.సంధ్యారాణి, పీఈటీ ఏ.లావణ్య బుధవారం అభినందించారు.

టీసీ సీపీగెట్‌లో

రాష్ట్ర స్థాయి ర్యాంక్‌

మణుగూరు రూరల్‌: రాష్ట్రంలోని పీజీ కళాశాలల్లో ప్రవేశానికి కాకతీయ యూ నివర్సిటీ ఆధ్వర్యాన నిర్వహించిన టీజీసీపీ గెట్‌ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఇందులో మణుగూరుకు చెందిన భూక్యా భరత్‌ రాష్ట్ర స్థాయి 19వ ర్యాంక్‌ సాధించాడు. మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తిచేసిన ఆయన సీపీ గెట్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంక్‌ సాధించడంపై ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ యర్నం చిన్నప్పయ్యతో పాటు అధ్యాపకులు బుధవారం అభినందించారు.

బాల పురస్కార్‌

దరఖాస్తు గడువు పెంపు

ఖమ్మంమయూరిసెంటర్‌: ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డుల కోసం దరఖాస్తు గడువును పొడిగించినట్లు జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారి ఏ.ప్రమీల తెలిపారు. గతంలో ఉన్న గడువు జూలై 31తో ముగియగా, ఆగస్టు 15 వరకు పొడిగించారని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలు, అసాధారణ ప్రతిభాపాటవాలు, ఆటలు, కళలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్యసాహసాలు తదితర అంశాల్లో విశేష ప్రతిభ కనబరిచిన 5 – 18 ఏళ్ల లోపు బాలబాలికలు ఈ అవార్డులకు అర్హులని తెలిపారు. ఆపదలో ఉన్న బాలబాలికలను రక్షించిన వారు, బాలల జీవితాల్లో మార్పు తెచ్చేలా ఏడేళ్లకు పైగా సేవలు అందించిన స్వచ్ఛంద సంస్థలు కూడా అవార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు https:// awards. gov. in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఆ పత్రాలను తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement