అశ్వారావుపేటరూరల్: పెదవాగు ప్రాజెక్టు మధ్యతరహా ప్రాజెక్టులో వరదనీరు కొద్ది రోజు లుగా వృథాగాపోతోంది. రెండేళ్ల క్రితం కురిసి న భారీ వర్షాలతో అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి వద్దగల పెదవాగు ప్రాజెక్టు ప్రధాన ఆనకట్టకు భారీ గండ్లు పడిన సంగతి తెలిసిందే. ఆ నాటి నుంచి ప్రాజెక్టు మరమ్మతులకు నోచుకోవడం లేదు. తాత్కాలి కంగా రింగ్‌బండ్ నిర్మించి చేతులు దులుపుకున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల్లో వాగుల నుంచి వస్తున్న వరదనీరు ప్రాజెక్టు మూడు గేట్ల నుంచి వృథాగా బయటకు వెళ్లి దిగువలో ఉన్న గోదావరిలో కలుస్తోంది. దీంతో ఆయకట్టు రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది.


