పట్టా ఇప్పిస్తానని మోసం | - | Sakshi
Sakshi News home page

పట్టా ఇప్పిస్తానని మోసం

Aug 5 2026 12:12 AM | Updated on Aug 5 2026 12:12 AM

న్యాయం చేయాలని బాధితుడి వేడుకోలు

దమ్మపేట: వ్యవసాయ భూమికి పట్టాదారు పాస్‌ పుస్తకం మంజూరు చేయిస్తానని రూ. లక్ష డిమాండ్‌ చేసినట్లు బాధితుడు ఆరోపిస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో బాధితుడు తెలిపిన వివరాలు... మండలంలోని ముష్టిబండ గ్రామానికి చెందిన వృద్ధ రైతు గండిపూడి వెంకటేశ్వరరావుకు సర్వే నంబర్‌ 143లో అర ఎకరం వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమికి పట్టా ఇప్పిస్తానని, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు నమ్మబలికి రూ.50 వేలు వసూలు చేశాడు. కొంతకాలం తర్వాత మరో రూ.50 వేలు కావాలని, లేకపోతే పాస్‌ బుక్‌ రాదని తెలిపాడు. దీంతో మోసపోయనని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తహసీల్దార్‌ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement