ఖమ్మం సహకారనగర్: కారేపల్లి మండలం గుడితండాకు చెందిన భూక్యా వెంకటేష్‌కు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది. ఆయన ఫిజిక్స్ విభాగంలో ‘సింథసిస్, క్వారటరైజేషన్, ఫొటో క్వాటిలిటిక్ డై డిగరడేషన్ అప్లికేషన్స్ ఆఫ్ రేర్ – ఎర్త్ మెటల్ ఆయాన్ కో సబ్‌స్టిట్యూటెడ్ క్వాడమియం కోబాల్ట్ స్పినల్ నానో ఫైరెట్స్’ అంశంపై ప్రొఫెసర్ జె.లక్ష్మణ్ నాయక్ పర్యవేక్షణలో పరిశోధనాపత్రం సమర్పించారు. ఈమేరకు ఓ యూ నుంచి డాక్టరేట్ ప్రకటించారు. ప్రస్తుతం సైఫాబాద్ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేష్‌ను పలువురు అభినందించారు.
వేట కేసులో
మరో ఇద్దరి అరెస్ట్
తల్లాడ: విద్యుత్ తీగలు అమర్చి ఎలుగుబంటిని హతమార్చిన కేసులో పరారీ లో ఉన్న ఇద్దరు నిందితులను అటవీ శాఖాదికారులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు అరెస్ట్ చేయగా, కొత్త బోడుమల్లెకు అజ్మీరా కృష్ణ, లోకారానికి చెందిన ఏనుగంటి రామకృష్ణ పట్టుబడ్డారని తల్లాడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉమ తెలిపారు. తల్లాడలో మంగళవారం ఆమె మాట్లాడుతూ నిందితులను సత్తుపల్లి కోర్టులో హాజరుపర్చి, న్యాయస్థానం ఆదేశాలతో రిమాండ్ నిమిత్తం ఖమ్మం జిల్లా జైలుకు తరరలించామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ఉద్యోగులు పి.సురేష్‌కుమార్, ఆఫీసర్, రమేష్, అజమ్ ఆలీ, తెనాలి శ్రీను, తేజావత్ కృష్ణ, అమ్జద్‌పాషా, నాగరాజు పాల్గొన్నారు.
4.25 కేజీల
గంజాయి స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మం రైల్వేస్టేషన్‌లోని రెండో ప్లాట్‌ఫామ్ వెనకాల ఎకై ్సజ్ పోలీసులు మంగళవారం చేపట్టిన తనిఖీల్లో గంజాయి లభించింది. ఒడిశాలోని బెర్హంపూర్ నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న నలు గురు పట్టుబడగా, వారి నుంచి 4.25 కిలోల గంజా యి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను రిమాండ్‌కు తరలించి నట్లు ఖమ్మం–2 ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ బి.చంద్రమోహన్ తెలిపారు.


