భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో సోమవారం శ్రీ సీతారాముల నిత్యకల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
పథకాలు
అర్హులందరికీ చేరాలి
ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్
భద్రాచలం: ప్రభుత్వ పథకాలు అర్హులైన గిరిజ నులకు అందాలని ఐటీడీఏ ఏపీఓ(జనరల్) డేవిడ్ రాజ్ అన్నారు. సోమవారం ఐటీడీఏలో నిర్వహించిన గిరిజనదర్బార్‌లో ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారినుంచి దరఖా స్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ అర్హతల మేరకు అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గిరిజన దర్బార్‌లో 150 దరఖాస్తులు వచ్చాయని తెలి పారు. ఈ కార్యక్రమంలో అధికారులు చందన, ఆనంద్‌కుమార్, అరుణకుమారి, సైదులు, ఉదయ్‌కుమార్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
దక్షిణ ప్రాకారం కూల్చివేత
శరవేగంగా
రామాలయ పునరుద్ధరణ పనులు
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే యాగశాల, లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయ గ్రిల్స్ తొలగించారు. దక్షిణం వైపు ప్రాకారాన్ని సోమవారం కూల్చివేశారు. దీంతో యంత్రాలు వెళ్లేందుకు మార్గం ఏర్పడగా, అమ్మవారి ఉపాలయం, భద్రుని గుడిని తొలగించనున్నారు. ఉత్తరం ప్రాకా రాన్ని కూడా ఇటు నుంచే తొలగించనున్నారు. దక్షిణం వైపు మెట్ల పక్కనున్న పూర్వ ఈఓ కార్యాలయం, లిఫ్ట్ మినహా ప్రొటోకాల్ గదులను నేలమట్టం చేశారు. విస్తా కాంప్లెక్ష్‌క్స్ సముదాయాన్ని తొలగించేందుకు ఈ నెల 15 లోపుగా ఖాళీ చేయాలని దుకాణదారులకు అధికారులు ఆదేశాలను జారీ చేశారు.
బాలుడి మృతిపై విచారణ
గుండాల: సింగారంలో 9 సంవత్సరాల బాలుడి మృతిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విచారణ నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రతాప్, మలేరియా అధికారి శ్రీధర్ ఆళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సింగారం గ్రామాన్ని సోమవారం సందర్శించారు. బాలుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులను కలిసి వివరాలు సేకరించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. కాగా, గ్రామంలో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. సుమారు 170 మంది గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి మందులు అందజేశారు. సిబ్బంది గోపీలాల్, నాగభూషణం, గొంది వెంకటేశ్వర్లు, పాయం శ్రీనివాసరావు, సర్పంచ్ ఉమ పాల్గొన్నారు.


