సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెంలో సోమవారం నిర్వహించిన చెస్ పోటీల్లో ప్రతిభ చూపినవారిన రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. త్రీ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి విజేతలకు బహుమతులను అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ జిల్లాల నుంచి 60 మంది క్రీడాకారులు హాజరుకాగా, అండర్–13, అండర్–10 విభాగాల్లో ఎంపికలు నిర్వహించారు. ఎంపికై నవారిలో తోట జిజ్ఞాస, మోక్షిత, పీ సాధిక, బీ జెస్సీ, ఇష్హిత, రేయాన్ష్, పీ జస్విక్, శ్రీహిమా న్షు, ఉజ్వల్, యస్విక్ యువన్, గౌతం చంద్ర మోక్షిత్, సుహాస్, సిహెచ్ గౌతంకృష్ణ,, దారా తన్మయ కృతి, సుభా హిమజ ఉన్నారు. వీరు ఈ నెల 6న హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో పాల్గొననున్నారు. నిర్వాహకులు, అసోసియేషన్ బాధ్యులు డాక్టర్ శ్రీని వాస్, జ్యోత్స్న, సీహెచ్ గోపీకృష్ణ, రంజిత్ రాజు పాల్గొన్నారు.
పీకేఓసీ–2 బ్లాక్ దక్కడం హర్షణీయం
సూపర్‌బజార్(కొత్తగూడెం)/రుద్రంపూర్: కార్మికుల ఐక్య పోరాటాల ఫలితంగానే మణుగూరు పీకేఓసీ–2 డీప్ సైడ్ బొగ్గు బ్లాక్‌ను సింగరేణి కేటాయించారని ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ సోమవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి గని కేటాయించడం హర్షణీయమని పేర్కొన్నారు. సీపీఐ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహించామని వారు తెలిపారు.
భజన పోటీలు ప్రారంభం
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని శ్రీ కల్పవృక్ష నరసింహస్వామి ఆలయంలో రాష్ట్రస్థాయి భజన పోటీలు సోమవారం ప్రారంభమయ్యా యి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భజన బృందాల హరినామ సంకీర్తనలు, సంప్రదా య కీర్తనలు ఆలపించారు. మూడు రోజులపాటు పోటీలు సాగనుండగా, తొలిరోజు భజన బృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నిర్వాహకులు కృష్ణచైతన్య స్వామి తదితరులు పాల్గొన్నారు.
చారిత్రక కట్టడాల
పరిరక్షణకు పెద్దపీట
ఖమ్మంమయూరిసెంటర్: దేశవ్యాప్తంగా చారిత్రక సంపద పరిరక్షణతో పాటు, ఆధునిక సాంకేతికతను జోడించి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి లోక్‌సభలో సోమవారం అడిగిన ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు. తెలంగాణలోని చారిత్రక కట్టడాల పరిరక్షణకు హైదరాబాద్ సర్కిల్ ద్వారా గడిచిన ఐదేళ్లలో కేటాయింపులు పెరిగాయని తెలిపారు. ‘అడాప్ట్ ఏ హెరిటేజ్ – 2.0’ కింద చారిత్రక ప్రదేశాల్లో వసతులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో ఎంపిక చేసిన 41,762 పాఠశాలలకు గాను 2,104 స్కూళ్లలో స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటయ్యాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని 20,490 పాఠశాలల్లో కంప్యూటర్ సౌకర్యం అందుబాటులోకి రాగా, 15,535 పాఠశాలలకు ఇంటర్నెట్ సేవలు సమకూర్చామని చెప్పారు. అంతేకాక రాష్ట్రంలో డిజిటల్ బోధనపై శిక్షణ పొందిన ఉపాధ్యాయుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని వివరించారు.
కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీలో పొగ, మంటలు
మధిర: తిరుపతి నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ బోగీలో సోమవారం మంటలు వ్యాపించాయి. కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు ఎర్రుపాలెం రైల్వేస్టేషన్ దాటగానే బీ4 ఏసీ బోగీలో కంప్రెషన్ బెల్టులు కాలిపోయి పొగ వ్యాపించింది. ప్రయాణికులు గమనించి చైన్ లాగడంతో తొండల గోపవరం రైల్వేస్టేషన్ వద్ద నిలిచిపోయింది. అప్పటికే పొగకు తోడు మంటలు వ్యాపిస్తుండడంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు కిందకు దిగారు. ఏసీ మెకానిక్ వచ్చి మరమ్మతులు చేపట్టి కాలిపోతున్న ఏసీ కంప్రెషర్ బెల్ట్‌లను తొలగించాక సుమారు 20 నిమిషాల అనంతరం రైలు తిరిగి బయలుదేరింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


