వివాదాస్పద భూమిలో ప్లాంటేషన్‌.. | - | Sakshi
Sakshi News home page

వివాదాస్పద భూమిలో ప్లాంటేషన్‌..

Aug 4 2026 12:47 AM | Updated on Aug 4 2026 12:47 AM

● పనులు ప్రారంభించిన అటవీశాఖ అధికారులు ● సస్పెండైన అధికారిని విధుల్లోకి తీసుకునే అవకాశం

ప్లాంటేషన్‌ పనులు ప్రారంభించాం..

● పనులు ప్రారంభించిన అటవీశాఖ అధికారులు ● సస్పెండైన అధికారిని విధుల్లోకి తీసుకునే అవకాశం

అశ్వాపురం: రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైన మండల పరిధిలోని మనుబోతులగూడెం గ్రామ పంచాయతీ వేములూరులోని వివాదాస్పద భూమి లో సోమవారం ప్లాంటేషన్‌ పనులు చేపట్టారు. అధికారులు ఇరువర్గాలతో విచారణ జరిపి 20 హెక్టార్లలో మణుగూరు ఎఫ్‌డీఓ బాబు, రేంజర్‌ ఉపేందర్‌ పర్యవేక్షణలో అటవీ సిబ్బంది పనులు చేపట్టారు. పోడు భూముల విషయమై గత నెల 17న ఫారెస్ట్‌ సిబ్బందికి, ఆదివాసీలకు ఘర్షణ జరి గింది. దీంతో అటవీ సిబ్బంది, ఆదివాసీ మహిళలు గాయపడ్డారు. ఈ ఘటనలో బీట్‌ ఆఫీసర్‌ను తాత్కాలికంగా సస్పెండ్‌ చేశారు. ప్రత్యేకంగా కమి టీ వేసి విచారణ చేపట్టారు. డీఎఫ్‌ఓ, ఐటీడీఏ పీఓ, సబ్‌ కలెక్టర్‌ గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. సస్పెండైన అధికారి నుంచి కూడా వివరణ తీసుకున్నట్లు సమాచారం. ఐటీడీఏ కార్యాలయంలో ఏపీఓ, అధికారులు ఆదివాసీలతో మా ట్లాడి పూర్తి వివరాలు సేకరించారు.

20 హెక్టార్లలో ప్లాంటేషన్‌..

వేములూరులో 269 ఎకరాల అటవీ భూమి ఆది వాసీల పోడు సాగులో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఒక్కో కుటుంబానికి 10 ఎకరాలకు పైగా ఉందని, నిబంధనల ప్రకారం పదెకరాలకు లోపే ఉండాలని ఫారెస్ట్‌ అధికారులు చెబుతున్నారు. 269 ఎకరాల భూముల్లో 120 ఎకరాలు గత ఏడాది క్రితం ప్లాంటేషన్‌ వేశారు. తాజాగా మరో 20 హెక్టార్లలో ప్లాంటేషన్‌ పనులు ప్రారంభించారు. కాగా తాత్కాలికంగా సస్పెండ్‌ చేసిన బీట్‌ అధికారిని విధుల్లోకి తీసుకోనున్నట్టు సమాచారం.

వేములూరు ఘటనపై నిజనిర్ధారణ కమిటీ విచారణ చేసి నివేదిక అందజేసింది. బీట్‌ అధికారి సంపత్‌ను తాత్కాలికంగానే సస్పెండ్‌ చేశాం. ఆయనకు ఏఓసీ ఇచ్చారు. దానిపై వివరణ ఇచ్చాక తదుపరి నిర్ణయం తీసుకుంటారు. అటవీ భూముల్లో ప్లాంటేషన్‌ పనులు ప్రారంభించాం.

–బి.బాబు, ఎఫ్‌డీఓ మణుగూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement