సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనాలివ్వాలి | - | Sakshi
Sakshi News home page

సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనాలివ్వాలి

Jul 27 2026 12:18 AM | Updated on Jul 27 2026 12:18 AM

బూర్గంపాడు: వ్యవసాయ మార్కెట్‌ కమిటీల సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనం రూ.19 వేలు అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ మార్కె ట్‌ కమిటీల సెక్యూరిటీ గార్డ్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటాల సోమ న్న డిమాండ్‌ చేశారు. బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో ఆదివారం నిర్వహించిన యూనియన్‌ రాష్ట్రస్థాయి సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని 192 వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో 1,200 మంది సెక్యూరిటీ గార్డులు 30 ఏళ్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. వారి సమస్యల పరిష్కారం కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్నామని అన్నారు. రూ 5లక్షల రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందించాలన్నారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ ల సాంబయ్య, నాయకులు సదానందం, వెంకట నారాయణ, సారిక రాము, ఎండీ మస్తాన్‌, రామాంజనేయులు, ఎస్‌ రమేష్‌, వెంకటేశ్‌, మహేందర్‌రెడ్డి, శోభారాణి, దుర్గా, మహమూద్‌, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఏఎంసీ సెక్యూరిటీ గార్డ్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement