రామయ్యకు సువర్ణ పుష్పార్చన | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు సువర్ణ పుష్పార్చన

Jul 27 2026 12:18 AM | Updated on Jul 27 2026 12:18 AM

భద్రాచలంటౌన్‌: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజ లు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆల య అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. సెలవు రోజు కావడంతో నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో నదీహారతి

భద్రాచలంటౌన్‌: భద్రాచలం వద్ద ఆదివారం గోదా వరి నదీ హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజ లు చేశారు. గణపతి పూజ, దీపోత్సవం, గోదావరి మాతకు అష్టోత్తర శతనామార్చన, శాంతి మంత్రా ల పఠనం నిర్వహించారు. పురోహితులు రామ వజ్జల రవికుమార్‌, సత్య ప్రసాద్‌ శర్మ, పవన్‌ కుమార్‌ శర్మ, రామాచార్యులు, వీరభద్ర శర్మ, సుబ్రహ్మణ్యం చార్యులు, తిరుపతిరావు, ఎన్‌ఎస్‌ఎన్‌ రెడ్డి, రామకష్ణ, తేజ శర్మ, అశోక్‌ కుమార్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement