న్యూస్‌రీల్
కార్పొరేట్ స్థాయిలో సేవలు అందించేలా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కార్యాలయాల నిర్మాణం చేపడుతోంది.
వాతావరణ ం
జిల్లాలో సోమవారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ఒకటి, రెండు జల్లులు కురిసే అవకాశం ఉంది.
సోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026
చెప్పకముందే.. చేసేశారు!
ముదిగొండ మండలం మేడేపల్లికి చెందిన పోటు ప్రసాద్ ఏటా ఖరీఫ్‌లో ఆరెకరాల్లో వరి సాగు చేస్తాడు. ఈ ఏడాది వర్షాబావ పరిస్థితులను గుర్తించి వరి స్థానంలో పెసర సాగు చేశాడు. ప్రస్తుతం పెసర పైరు పూత దశకు చేరింది. ‘అధికారులు వర్షాభావ పరిస్థితులపై ముందు నుంచే చెబుతున్నారు. అవేమీ పట్టించుకోకుండా వరి వేసినా నీటి ఎద్దడికి గురై నష్టపోయే పరిస్థితి వస్తుంది. అందుకే వరికి బదులు ప్రత్యామ్నాయం పెసర మంచిదని భావించి సాగు చేస్తున్నా’ అని ప్రసాద్ వివరించాడు.


