వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎం కావాలని.. | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎం కావాలని..

Jul 27 2026 12:18 AM | Updated on Jul 27 2026 12:18 AM

పాల్వంచ: వైఎస్సార్‌ సీపీ అధినేత, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కావాలని పాల్వంచకు చెందిన అభిమానులు ఖలీల్‌ పాషా, దాసరి కిరణ్‌ కుమార్‌ ఆదివారం పాదయాత్ర చేపట్టారు. సుజాతనగర్‌ నుంచి భద్రాచలం వరకు ఆదివారం సుమారు 60 కిలో మీటర్లు పాదయాత్రగా వెళ్లారు. మార్గమధ్యలో పాల్వంచలో వారి స్నేహితులు, వైఎస్‌ జగన్‌ అభిమానులు కలిసి అభినందించారు. జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా ఖలీల్‌, కిరణ్‌ మాట్లాడుతూ 2029లో జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. సంఘీభావం తెలిపిన వారిలో పి.వెంకటేశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, శ్రీను తదితరులు ఉన్నారు.

సుజాతనగర్‌ నుంచి భద్రాచలం వరకు అభిమానుల పాదయాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement