సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజావాణిలో అందించే వినతులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌వేణుగోపాల్ ప్రజలనుంచి విన తులు, ఫిర్యాదులను జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, జిల్లా గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సవైరామ్‌తో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే ప్రతీ వినతిని సకా లంలో పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేకదృష్టి సారించాలని ఆదేశించారు.
వినతుల్లో కొన్ని ఇలా..
● దరఖాస్తు చేసి రెండు నెలలు గడిచినా తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వడంలేదని కొత్తగూడేనికి చెందిన గుగులోతు కృష్ణకుమారి ఫిర్యాదు చేయగా, కొత్తగూడెం ఆర్డీఓకు ఎండార్స్ చేశారు.
● ధరణి సర్వే సమయంలో తన ఇంటి పన్ను అంచనా విలువ పొరపాటున సున్నాగా నమోదైందని, దీంతో ఇంటి పన్ను విధించడం లేదని సారపాక గాంధీనగర్ గ్రామపంచాయతీకి చెందిన తన్నీరు నాగదేవి తెలిపారు. ఇంటి పన్ను రశీదు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాలు తదితర సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇంటి పన్ను అంచనాను సరిచేసి పన్ను చెల్లించే అవకాశం కల్పించాలని కోరారు. ఈ దరఖాస్తును జిల్లా పంచా యతీ అధికారికి ఎండార్స్ చేశారు.
● తాను ఎంఏ, బీఎడ్ పూర్తి చేశానని, ఉపాధి అవకాశం కల్పించాలని ఇల్లెందు మండలం రొంపేడు గ్రామపంచాయతీకి చెందిన భాగ్యలక్ష్మి అర్జీ అందించగా, జిల్లా ఉపాధి కల్పన అధికారికి ఎండార్స్ చేశారు.
● సర్వే నంబర్ 228/2లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమికి పట్టాదారు పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయడంలేదని జూలూరుపాడు మండలం మాచినేనిపేట గ్రా మానికి చెందిన రవీందర్ ఫిర్యాదు చేయగా, దరఖాస్తును జూలూరుపాడు తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు.
అదనపు కలెక్టర్ వేణుగోపాల్


