పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణపుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. చుంచుపల్లికి చెందిన అమ్మవారి భక్తులైన పొన్నపు వెంకటసత్యనారాయణరెడ్డి, లక్ష్మి దంపతులు ఆలయానికి రూ.58,116 విరాళం అందజేశారు. ఆలయ ఈఓ విజయ్‌కుమార్, అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు.


