ఇంటర్ విద్యార్థుల
ఉత్తీర్ణతా శాతం వివరాలు..
● ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటిన జిల్లా విద్యార్థులు ● ప్రథమ సంవత్సరంలో 63.49 శాతం.. ● ద్వితీయ సంవత్సరంలో 77.71 శాతం ఉత్తీర్ణత ● రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచిన జిల్లా
పాల్వంచరూరల్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈసారి కూడా విద్యార్థినులు సత్తా చాటారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌లో 63.49 శాతం, సెకండియర్‌లో 77.71 శాతం ఉత్తీర్ణత సాధించగా, జిల్లా రాష్ట్రస్థాయిలో 9వ స్థానంలో నిలిచింది.
జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో విద్యార్థులు 8,508 మంది పరీక్ష రాయగా 6,620 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 2,765 మందికి 1,919 మంది, బాలికలు 4,005 మందికి 3,342మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌లో మొత్తం 9,279 మందికి 5,819మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 3,146మందికి 1629 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 4,354మందికి 3,133 ఉత్తీర్ణులయ్యారు.
ద్వితీయ సంవత్సరంలో 1,738 మందికి 1,359 మంది ఉత్తీర్ణులు కాగా, 77.19 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రథమ సంవత్సరంలో 1,779 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 1,057 ఉత్తీర్ణులయ్యారు. 59.42శాతం ఉత్తీర్ణత వచ్చింది.
గతేడాది జిల్లాలో ప్రథమ సంవత్సరంలో 62.56 శాతం ఉత్తీర్ణత సాధిచంగా, ద్వితీయ సంవత్సరంలో 71.27 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాదికంటే ఈసారి కొంతమెరుగైన ఫలితాలు సాధించగా, రాష్ట్రస్థాయిలో జనరల్ ఇంటర్‌లో 9వ స్థానం, ఒకేషనల్‌లో 8వ స్థానంలో జిల్లా నిలిచింది.
ఫెయిల్ అయిన విద్యార్థులు, అనుకున్న దాని కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు సమాధాన పత్రాలను రీకౌంటింగ్, స్కాన్ చేసి న కాపీతో కూడిన రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్(డీఐఈఓ) అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. గడువు ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు ఉందని పేర్కొన్నారు.
ఇంటర్మీడిఝెట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు (థియరీ) మే 13 నుంచి మొదలవుతా యని డీఐఈఓ తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించా రు. ఫెయిల్ అయిన విద్యార్థులు సంబంధిత జూనియర్ కళాశాలలో ఈ నెల 13 నుంచి 20వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
బాలురు బాలికలు మొత్తం
సెకండియర్
జనరల్ 69.4 83.45 77.71
ఒకేషనల్ 66.09 86.16 78.19
ఫస్టియర్
జనరల్ 51.78 71.96 63.49
ఒకేషనల్ 44.69 71.98 59.42


