●ప్రధాని చేతుల మీదుగా అందుకున్న నూతనప్రసాద్
నేలకొండపల్లి: మండలంలోని మంగాపుర తండాకు చెందిన ఆర్మీ జవాన్ భూక్యా నూతనప్రసాద్ విధినిర్వహణలో ప్రతిభకు గాను గుర్తింపు లభించింది. 2024లో మణిపూర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడులను తిప్పికొట్టటంలో ఆయన ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా నూతనప్రసాద్‌కు కేంద్రప్రభుత్వం వీరశౌర్య దివస్ అవార్డు ప్రకటించింది. ఢిల్లీలో ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆయనకు అవార్డు అందజేయగా కుటుంబీకులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.


