భద్రాచలం టౌన్: గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీ డియట్ ఫలితాల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫలితాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు. ప్రథమ సంవత్సరంలో 1,456 మంది పరీక్షలు రాయగా 1,192 మంది ఉత్తీర్ణులై 81.76 శాతం ఫలితాలు నమోదయ్యాయి. ఇందులో బాలికలు 86 శాతం, బాలురు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 1,370 మందిలో 1,239 మంది ఉత్తీర్ణులు కాగా, 90.44 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికలు 91.77 శాతం, బాలురు 88.08 శాతం ఉత్తీర్ణత పొందారు. ఖమ్మం రీజియన్ పరిధిలో ఫస్టియర్‌లో యుగంధర్ 468, జోషిత్ 467, కృష్ణవేణి 467, కీర్తన, రమ్య 466 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో గణేష్ 991, నితిన్ 980, జస్వంత్ 979, దివ్య 978 మార్కులతో సత్తా చాటారు.


