పాల్వంచరూరల్: జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. పాల్వంచ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండియర్ హెచ్‌ఈసీ గ్రూప్ చదివిన ఎన్.మణి సంపన్న 1000 మార్కులకు గాను 985 మార్కులను సాధించింది. రాష్ట్రస్థాయి ఇదే గ్రూప్‌నకు చెందిన జి.కీర్తి 1000 మార్కులకుగాను 923 మార్కులు, ఏఈటీ గ్రూపు విద్యార్థి మడకం చొక్కారావు 922మార్కులు సాధించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ అభినంధించారు.
ఫస్టియర్‌లో మోరంపల్లి బంజర విద్యార్థి
బూర్గంపాడు: మోరంపల్లిబంజర గ్రామానికి చెందిన పేరం మహేందర్‌రెడ్డి స్టేట్ ర్యాంకు సాధించాడు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి స్టేట్ ర్యాంకర్‌గా నిలిచాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న మహేందర్‌రెడ్డి స్టేట్ ర్యాంకు సాధించటం పట్ల తల్లిదండ్రులు రామకొండారెడ్డి, రమాదేవి, స్థానికులు అతనిని అభినందించారు.


