చుంచుపల్లి: సీనియర్, జూనియర్ ఇంటర్ ఫలితాల్లో కొత్తగూడెంలోని కృష్ణవేణి విద్యార్థులు అత్యత్తమ ఫలితాలు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో కె.కావ్యకళ వేయి మార్కులకు 995 మార్కు లు, ఎన్.చందన 995 మార్కులు సాధించి సత్తా చాటారు. బైపీసీలో జి.ప్రహర్ష వేయి మార్కులకు 994 మార్కులు సాధించి రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచింది. అలాగే, జూనియర్ ఇంటర్ ఎంపీసీలో సీహెచ్.భావన 470 మార్కులకు 468 మార్కులు, కె.పల్లవి 467, ఎస్‌కే ఫాతిమా 466 మార్కులు, బైపీసీలో సీహెచ్.ప్రశాంత్ 440 మార్కులకు 437 మార్కులు, సీఈసీలో ఇ.గీతిక 500 మార్కులకు 489 మార్కులు సాధించింది. విద్యార్థులతో పాటు వారు అత్యత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేసిన అధ్యాపకులను డైరెక్టర్లు ఎం.కోటేశ్వరరావు, జగదీశ్, వెంకటేశ్వరరావు, రామారావు అభినందించారు.


