పెద్దమ్మతల్లికి విశేషపూజలు | - | Sakshi
Sakshi News home page

పెద్దమ్మతల్లికి విశేషపూజలు

Apr 13 2026 7:56 AM | Updated on Apr 13 2026 7:56 AM

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఆదివారం మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆల య ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్‌ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో నదీ హారతి

భద్రాచలంటౌన్‌: భద్రాచలంలోని గోదావరి తీరం ఆదివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పురోహితుడు రవికుమార్‌ ఆధ్వర్యంలో వేద పండితులు గోదావరి మాతకు శాస్త్రోక్తంగా పూజ లు నిర్వహించారు. గణపతి పూజ, దీపోత్సవం, అష్టోత్తర శతనామార్చన గావించారు. భక్తి శ్రద్ధలత నదీ హారతి సమర్పించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సేవా లక్ష్మీనారాయణ దంపతులు, వారణాసి, కాశీ ప్రాంతాలకు చెందిన రిషికేశ్‌–సరిత, రాజేష్‌–అనామిక, అంజుకుమారి కుటుంబ సభ్యులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. భద్రాచలం రెడీమేడ్‌ బట్టల షాప్స్‌ అసోసియేషన్‌ వారు పూజా సామగ్రిని సమకూర్చారు.

రామయ్యకు స్వర్ణ పుష్పార్చన

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారి మూలమూర్తులకు ఆదివారం స్వర్ణ పుష్పార్చన, అభిషేకం జరి పారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరా ధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచ నం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్ర ధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement