అన్నింటా ప్రగతి | - | Sakshi
Sakshi News home page

అన్నింటా ప్రగతి

Aug 16 2025 6:59 AM | Updated on Aug 16 2025 6:59 AM

అన్ని

అన్నింటా ప్రగతి

గోదావరి నదిపై ప్రయాణాలు.. ఆయిల్‌పామ్‌, కోకో సాగుకు హబ్‌.. 1,15,204 మందికి ఆసరా పెన్షన్‌

రూ.39.80 కోట్లతో పంచాయతీ భవనాలు..

నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు

కొత్త సబ్‌స్టేషన్లు, లైన్లు

ఆరోగ్యశ్రీ పథకంలో

రూ. 7.97 కోట్ల విలువైన వైద్య సేవలు

స్వాతంత్య్ర వేడుకల్లో

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): అన్ని రంగాల్లో జిల్లా ప్రగతిపథంలో పయనిస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో అభివృద్ధిలో అగ్రగామి దిశగా దూసుకుపోతోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ప్రగతి మైదానంలో 79వ స్వాతంత్య్ర వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తుమ్మల మొదట జాతీయ పతాకాన్ని అవిష్కరించారు. పతాకవందనం అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఓపెన్‌ టాప్‌ జీపులో కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, ఎస్పీ రోహిత్‌రాజులతో కలిసి ప్రగతి మైదానంలో తిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ చేరినప్పుడే నిజమైన స్వాతంత్య్రం సిద్ధించినట్లని వ్యాఖ్యానించారు. జిల్లా పారిశ్రామికంగా మాంచెస్టర్‌ ఆఫ్‌ తెలంగాణగా, ఎకో టూరిజానికి కేరాఫ్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.

గోదావరి నదిపై ప్రయాణాలు జరిగేలా వాటర్‌వేస్‌ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, సింగరేణి విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు. భద్రాచలంలో గోదావరి వరదలకు అడ్డుకట్టగా కరకట్ట విస్తరణ పనులు సాగుతున్నాయని తెలిపారు. పాండురంగాపురం నుంచి మల్కాన్‌గిరి వరకు, కొత్తగూడెం నుంచి కీరండోల్‌ రైల్వే కనెక్టివిటీ భద్రాచలం రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. అశ్వారావుపేటలో కొబ్బరి పరిశోధనా కేంద్రం, కొత్తగూడెంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి ప్రతిపాదన చేసినట్లు చెప్పారు. పెద్దవాగు ప్రాజెక్ట్‌ ఆధునికీకరణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి రూ.93 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

జిల్లాలో రూ 318.69 కోట్ల రైతు భరోసా, మృతి చెందిన 698 మంది రైతు కుటుంబాలకు రూ.34.90 కోట్ల పరిహారం అందించినట్లు తెలిపారు. ఆయిల్‌పామ్‌, కోకో సాగులో తెలంగాణకు జిల్లా హబ్‌గా మారిందన్నారు. సబ్సిడీపై డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు అందిస్తున్నామని, ఆరు వ్యవసాయ మార్కెట్ల పరిధిలో 34 వేల 650 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన 19 గోదాములు నిర్మించామని తెలిపారు. జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు 21 ఉన్నాయని, 9వేల 181 మెట్రిక్‌ టన్నుల ఎరువులు, 3,168 కిలోల విత్తనాలను పంపిణీ చేసినట్లు వివరించారు. జిల్లాలో 2 లక్షల 76 వేల 57 ఆహార భద్రత కార్డులు, 21 వేల 129 అంత్యోదయ కార్డుల ద్వారా 9లక్షల 3వేల 66 మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు కొత్త సబ్‌స్టేషన్లు, 33 కేవీ లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

భూభారతి చట్టం కింద 78,278 దరఖాస్తులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉపాధిహామీ పథకంలో ఇప్పటివరకు 23 లక్షల 25వేల పనిదినాలు కల్పించామని, రూ. 63.17 కోట్లు కూలీలకు చెల్లించామని వివరించారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. టీజీ ఐపాస్‌ ద్వారా 23 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామని, టీ ఐడియా రాయితీ పథకంలో 38 యూనిట్లకు రూ 1.47 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. జిల్లాలో 1,15,204 మందికి ప్రతినెలా రూ.25.97 కోట్ల ఆసరా పెన్షన్‌ చెల్లిస్తున్నామని తెలిపారు. సీ్త్రనిధి రుణాలు రూ. 25.22 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మహిళలకు సూక్ష్మ రుణ వ్యాపారాల కింద 448 యూనిట్లకు రూ 9.43 ట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలు మంజూరు చేస్తామని అన్నారు. అర్హులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు అందిస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలో 199 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను రూ.39.80 కోట్లతో ప్రారంభించామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో రూ. 7.97 కోట్ల వైద్య సేవలు 3,241 మందికి అందజేసినట్లు వివరించారు. రూ.130 కోట్లతో ప్రభుత్వ వైద్యశాలల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. పౌష్టికాహార పథకంలో 30 వేల మంది చిన్నారులకు బాలామృతం కింద నెలలో 16 రోజులు గుడ్లు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ట్రైనీ కలెక్టర్‌ సౌరభ్‌శర్మ, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్‌, విద్యాచందన, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కొబ్బరి పరిశోధనా కేంద్రం, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌కు ప్రతిపాదనలు

అన్నింటా ప్రగతి1
1/3

అన్నింటా ప్రగతి

అన్నింటా ప్రగతి2
2/3

అన్నింటా ప్రగతి

అన్నింటా ప్రగతి3
3/3

అన్నింటా ప్రగతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement