
వాతావరణ ం
గరిష్టం / కనిష్టం
290 / 240
జిల్లాలో శనివారం ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉంది.
కలెక్టరేట్‌లో పతాకావిష్కరణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్, క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అదనపు కలెక్టర్లు డి వేణుగోపాల్, విద్యాచందన, అధికారులు పాల్గొన్నారు.
సీఎం చేతుల మీదుగా జిల్లావాసికి అవార్డు
దమ్మపేట: మండలంలోని పట్వారిగూడెం గ్రామానికి చెందిన, ఏసీపీ మోహన్‌కుమార్ హైదరాబాద్‌లోని గోల్కొండలో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ఇండియన్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీసెస్ అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా అందుకున్నారు. మోహన్‌కుమార్ హైదరాబాద్‌లోని సెంట్రల్ జోన్ ట్రాఫిక్ ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో విశిష్ట సేవలకు గత రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మెరిటోరియస్ సర్వీసెస్ అవార్డును ప్రకటించింది. ఆ అవార్డును స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం అందించిన అభినందించారు. ఈ సందర్భంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు.

వాతావరణ ం