
స్వర్ణకవచ ధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
బంగారు ఆభరణం వితరణ
శ్రీ సీతారామ చంద్రస్వామివారికి భద్రాచలానికి చెందిన ముదునూరు బలరామకృష్ణంరాజు స్మార్థకార్థం ఆయన సతీమణ పద్మావతి రూ.1,90,000 విలువైన 21 గ్రాముల బంగారు ఆభరణం ఆలయానికి అందజేశారు. ఆలయ సిబ్బంది కత్తి శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో అమ్మవారి జన్మస్థలం వద్ద అర్చకులు పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం జరిపారు. పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలు చేశారు. కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు.
ఢిల్లీలో స్వాతంత్య్ర వేడుకలకు గౌతంపూర్ కార్యదర్శి
చుంచుపల్లి: ఢిల్లీలోని ఎరక్రోటలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు చుంచుపల్లి మండలం గౌతంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి జక్కంపూడి షర్మిల హాజరయ్యారు. 2023లో ఆరోగ్య పంచాయతీ విభాగంలో గౌతంపూర్ గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఆమెను వేడుకలకు ఆహ్వానించి ప్రత్యేక మెమెంటోను బహూకరించారు. ఈ సందర్భంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఉమ్మడి జిల్లాకు
2,638 మెట్రిక్ టన్నుల యూరియా
చింతకాని: ఆర్‌ఎఫ్‌సీఎల్ కంపెనీ నుంచి జిల్లాకు 2,638.44 టన్నుల యూరియా సరఫరా అయింది. చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు శుక్రవారం చేరిన యూరియాను ఏఓ(టెక్నికల్) పవన్‌కుమార్ పరిశీలించి జిల్లాల వారీగా కేటాయించారు. ఖమ్మం జిల్లాకు 1,538.44 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాకు వెయ్యి టన్నులు కేటాయించగా వంద మెట్రిక్ టన్నుల యూరియాకు బఫర్ స్టాక్‌గా నిల్వ చేసినట్లు ఏఓ తెలిపారు. జిల్లాకు సరిపడా యూరియా చేరినందున రైతులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు.

స్వర్ణకవచ ధారణలో రామయ్య

స్వర్ణకవచ ధారణలో రామయ్య

స్వర్ణకవచ ధారణలో రామయ్య