స్వర్ణకవచాలంకరణలో రామయ్య దర్శనం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారు శుక్రవారం స్వర్ణకవచాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: మండల పరిధిలోని కేశవాపు రం–జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి అర్చకులు శుక్రవారం పంచామృతాభిషేకం చే శారు. ముందుగా అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతాలు, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంత రం మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేశా క నివేదన, హారతి, నీరాజన మంత్రపుష్పం స మర్పించారు. అనంతరం కుంకుమపూజ, గణప తి హోమం నిర్వహించారు. కార్యక్రమంలోఈఓ ఎన్.రజనీకుమారి, అర్చకులు పాల్గొన్నారు.
కోచ్‌ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధి లోని గిరిజన సంక్షేమ మోడల్ స్పోర్ట్స్ స్కూళ్లలో ఔట్ సోర్సింగ్ పద్ధతిపై ఏడాది కాలానికి కోచ్‌లను నియమించనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. కిన్నెరసానిలో మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో ఆర్చరీ కోచ్, కాచనపల్లిలోని మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో కబడ్డీ కోచ్ ఎంపికకు ఎన్‌ఎస్, ఎన్‌ఐఎస్‌లో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్ములని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ధ్రువపత్రాలతో ఈనెల 26నుంచి జూన్ 3వ తేదీ వరకు ఐటీడీఏలోని స్పోర్ట్స్ ఆఫీసర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా కానీ dtdo. bhadradri@gmail.com మెయిల్ ద్వారా కానీ దరఖాస్తులు పంపించాలని సూచించారు. వివరాలకు 98489 88205, 99123 62053 నంబర్లకు సంప్రదించాలని పీఓ తెలిపారు.
యువత అన్ని రంగాల్లో ముందుండాలి
కొత్తగూడెంఅర్బన్ : గిరిజన ప్రాంతాల్లో నివసించే యువత అన్ని రంగాల్లో ముందుండాలి ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. దమ్మపేట పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని కొండరెడ్ల గ్రామమైన పూసుకుంటకు చెందిన 12 మంది యువకులకు డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇప్పించగా.. శుక్రవారం ఎస్పీ రోహిత్‌రాజు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు, మైదాన ప్రాంతాల్లోని వలస గిరిజన యువతకు తమ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. క్రీడా పోటీల నిర్వహణ, ఉద్యోగాలు సాధించేందుకు శిక్షణ వంటివి ఏర్పాటు చేస్తామని తెలిపారు. యువత డ్రైవింగ్ లైసెన్స్‌లు లేక వాహన తలిఖీల్లో పట్టుబడుతున్నారని, అందుకే లైసెన్స్‌లు ఇప్పించేందుకు తమ శాఖ ముందుకొచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో దమ్మపేట ఎస్సై సాయికిషోర్ రెడ్డి పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఎంబీబీఎస్–2 ఖాళీ వైద్య పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోగా డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. నెలకు వేతనం రూ.52,351 చెల్లించనున్నట్లు తెలిపారు.
స్వర్ణకవచాలంకరణలో రామయ్య దర్శనం
స్వర్ణకవచాలంకరణలో రామయ్య దర్శనం


