పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్‌శర్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సైకిల్‌పై శబరిమలై..
అశ్వాపురం: మండల పరిధిలోని జగ్గారం గ్రామానికి చెందిన బాలిన శ్రీను(గురుస్వామి) సైకిల్‌పై శబరిమలై యాత్రకు బయల్దేరాడు. యాత్రను ఆదివారం మాజీ సర్పంచ్ సున్నం రాంబాబు ప్రారంభించారు. తాను ఐదోసారి సైకిల్‌పై శబరిమలై వెళ్తున్నట్లు శ్రీను తెలిపాడు.
పెద్దమ్మతల్లికి విశేష పూజలు


