అప్పులే మిగిలాయి
అంచనాకు మించి సాగైనా దెబ్బతిన్న వరి, పత్తి పంటలు
ప్రకృతి వైపరీత్యాలు, యూరియా కొరత ప్రభావం
ధర తగ్గడంతో పడిపోయిన మిర్చి సాగు
ప్రోత్సాహకంతో పెరిగిన
ఆయిల్ పామ్ సాగు
యాసంగిలో మొక్కజొన్న వైపు
రైతుల మొగ్గు
అన్నదాత కష్టం వరుణుడి పాలు
సాగు సంతృప్తికరం
ఆరుగాలం శ్రమిస్తే..
ప్రకృతి వైపరీత్యాలతో
ఏడాదంతా రైతులకు కష్టాలు, కడగండ్లే ఎదురయ్యాయి. తొలకరిలో సమృద్ధిగా
వర్షాలు కురిసినా ఆగస్టు, సెప్టెంబర్‌లో
అధిక వర్షపాతం నమోదు కావడంతో పంటలు దెబ్బతిన్నాయి. అంచనాకు మించి సాగు చేసిన పత్తి,
వరి పంటలు నష్టాన్నే మిగిల్చాయి. వానాకాలం సీజన్‌లో జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5,91,714
ఎకరాలుకాగా, 6,11,512 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. పత్తి దిగుబడి, మిర్చి ధర తగ్గి రైతులు ఆర్థికంగా కుదేలయ్యారు.
–సూపర్‌బజార్
(కొత్తగూడెం)
తగ్గిన మిర్చి సాగు
జిల్లాలో మిర్చి సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. గతేడాది 10,283 ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది 4,482.11 ఎకరాల్లో మాత్రమే వేశారు. విదేశాల నుంచి ఆర్డర్లు లేకపోవడంతో ఇక్కడ ప్రధానంగా సాగు చేసే ‘తేజా’ రకం మిర్చికి డిమాండ్ తగ్గింది. క్వింటాల్ ధర రూ.20 వేల నుంచి రూ.12 వేలకు పడిపోయింది. పెట్టుబడి ఖర్చులు పెరగడంతోపాటు తెగుళ్ల ప్రభావంతో దిగుబడి కూడా తగ్గింది. దీంతో రైతులకు పెట్టుబడి కూడా రాలేదు.
ఆయిల్ పామ్‌పై మొగ్గు
జిల్లాలో ఈఏడాది ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం గణనీ యంగా పెరిగింది. ప్రభుత్వం ఎకరాకు రూ.50వేల వరకు ప్రోత్సాహకాలను అందిస్తుండటం,నేలలు, నీటి వనరులు అనుకూలంగా ఉండటం, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే పంట కావడంతో రైతులు మొ గ్గు చూపారు. జిల్లాలో 19,968 మంది రైతులు 80, 635.62 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు.
యూరియా కష్టాలు
జిల్లాలో పంటల సాగుకు ఏప్రిల్ నుంచి 46,679 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, 38,098 మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. పంటల సాగువిస్తీర్ణం పెరగగా, యూరియా సరఫరా తగ్గడం తో రైతులు పడరాని పాట్లు పడ్డారు. సహకార సంఘాల వద్ద రోజుల తరబడి బారులుదీరారు. సకా లంలో, అవసరమైన యూరియా లభించక పంట దిగుబడులపై ప్రభావం పడింది. యాసంగి సీజన్‌లో కూడా యూరియా కష్టాలు మొదలయ్యాయి.
రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా
రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. 63,614 మంది రైతులు వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాల్లో రూ. 455.33 కోట్లను మాఫీ చేసింది. పంటల సాగుకు పెట్టుబడిగా రైతు భరోసా పథకం పేరిట ఎకరాకు రూ.6 వేల చొప్పున గడిచిన వానకాలం సీజన్‌కు 1,78,380 మంది రైతులకు రూ. 318.69 కోట్లను అందించారు. రైతు బీమా పథకం కింద 221 మంది కుటుంబాలు అర్హులు కాగా, ఇప్పటివరకు 168 మందికి రూ. 8.40 కోట్లు జమ చేశారు. ఇంకా 53 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
యాసంగి సీజన్ ప్రారంభం
యాసంగి సీజన్‌లో 1,56,667 లక్షల ఎకరాల్లో ప్రధాన పంటల సాగవుతాయని వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించింది. వానాకాలంలో వరి, పత్తి పంటలతో నష్టపోయిన రైతులు మొక్కజొన్న సాగుపై దృష్టి సారించారు. మాగాణి పొలాలు దున్నుతూ వెదజల్లే పద్ధతిలో వరి విత్తుతున్నారు. పలుచోట్ల వరినార్లు పోశారు. నీటి వనరుల ఆధారంగా వరి 79 వేలు, మొక్కజొన్న 69వేల ఎకరాలతోపాటు పెసర, మిను ము, వేరుశనగ పంటల సాగు లక్ష్యాలను వ్యవసాయ శాఖ ఖరారు చేసి ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
ఒడిదుడుకులతో సాగిన
వ్యవసాయం
పంటల ఉత్పత్తి దశలో కురిసిన వర్షాలు రైతులకు నష్టాలను మిగిల్చాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వానలతో పాటు అక్టోబర్‌లో సంభవించిన మోంథా తుపాను పంటలను దెబ్బతీశాయి. అధిక వానలతో పూత, కాత దశలో ఉన్న పత్తికి తీరని నష్టం వాటిల్లింది. ఎకరాకు సగటున 10 నుండి 12 క్వింటాళ్ల వరకు రావాల్సిన దిగుబడులు 5 నుండి 6 క్వింటాళ్లకు పడిపోయింది. తుపానుతో కోత దశలో ఉన్న వరి పంట నేలవాలగా, పత్తి పింజలు నల్లబడి కారిపోయాయి. ఆగస్టులో కురిసిన వర్షాలతో 50 మంది రైతులకు చెందిన 28.05 ఎకరాల్లో పంట లకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. రూ. 2,81,000 నష్టం జరిగిందని నివేదిక ఇచ్చారు. పంటనష్టం వేల ఎకరాల్లో జరిగినా సర్వే లోపాలతో అధికారులు అన్యాయం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో జిల్లాలో పంటల సా గు సంతృప్తికరంగా ఉంది. సంప్రదాయ పంట వరి సాగు విస్తీ ర్ణం పెరిగింది. అధిక వర్షపాతం వల్ల పత్తిదిగుబడిపై ప్రభావం చూపింది. మిర్చి విస్తీర్ణం తగ్గింది. యాసంగి సాగు ప్రారంభమైంది.
–ఽవి.బాబూరావు, జిల్లా వ్యవసాయాధికారి
అప్పులే మిగిలాయి
అప్పులే మిగిలాయి
అప్పులే మిగిలాయి
అప్పులే మిగిలాయి
అప్పులే మిగిలాయి
అప్పులే మిగిలాయి
అప్పులే మిగిలాయి


