జ్వరం వస్తే.. కాస్త జాగ్రత్త! | - | Sakshi
Sakshi News home page

జ్వరం వస్తే.. కాస్త జాగ్రత్త!

Jul 23 2026 1:48 AM | Updated on Jul 23 2026 1:48 AM

గురువారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2026 జ్వరం వస్తే.. కాస్త జాగ్రత్త! వీరికి ఇబ్బందులు ఎక్కువ ఇవి పాటించాలి..

న్యూస్‌రీల్‌

సాగర్‌ నీటిమట్టం

బాపట్ల
గురువారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2026

గుంటూరు మెడికల్‌: కరోనా వైరస్‌ మళ్లీ కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో నాలుగు కరోనా మరణాలు సంభవించినట్లు రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. తొలుత జిల్లాలో జూలై 16న మంగళగిరి ఎయిమ్స్‌ వైద్యులు స్థానిక యువతి(18)కి, నవులూరుకు చెందిన యువతి (27)కి కరోనా ఉన్నట్లు నిర్ధారించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు.

వైరస్‌ ప్రభావం చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ఉంటుంది. గుండె, కిడ్నీ, క్యాన్సర్‌, లివర్‌, ఊపిరితిత్తుల జబ్బులు ఉన్నవారు, బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు అవగాహన కలిగి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని వైద్యులు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం జిల్లాలో నమోదవుతున్న కరోనా వైరస్‌ కేసులు గతంలో థర్డ్‌వేవ్‌లో వచ్చిన ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ ఆర్‌ఎఫ్‌ 5గా వైద్య నిపుణులు తెలిపారు. వైరస్‌ సోకిన వారిలో జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, వాసన లేకపోవటం, రుచి తెలియకపోవటం వంటి లక్షణాలు ఉంటాయి. వైరస్‌ ఎవరికై నా సోకిందో.. లేదో.. తెలుసుకునేలోపు బాధితుల నుంచి ఇతరులకు వచ్చే ప్రమాదం ఉంది. దీని దృష్ట్యా కొద్దిరోజులపాటు ప్రజలంతా ప్రయాణాలు రద్దు చేసుకోవాలి. అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రాకుండా చూసుకోవాలి. కరచాలనం చేయడం మానివేయాలి. కొత్త వ్యక్తులు, పరిచయం లేనివారికి దూరంగా ఉండాలి. దగ్గిన, తుమ్మినా ముఖానికి కర్చీఫ్‌లు, మాస్క్‌లు అడ్డుపెట్టుకోవాలి. సాధ్యమైనంత మేరకు ఎక్కువ సార్లు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. జనసంచారం ఉండే సినిమాహాళ్లు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, మార్కెట్‌లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో తిరగకూడదు. దగ్గు, జలుబు బాధితులకు దూరంగా ఉండటం ఉత్తమం.

కరోనా నిర్ధారణ పరీక్షలు అవసరం

జిల్లాలో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల విషయంలో

అప్రమత్తత ముఖ్యం

వైద్య నిపుణులు, అధికారుల సూచనలు

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ మట్టం బుధవారం 513.30 అడుగులకు చేరింది. ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement