మాదల(ముప్పాళ్ళ): మండలంలోని మాదల గ్రామంలో ఉన్న జ్యోతిబా పూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను భారత రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవం బుధవారం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 120 మీటర్ల జాతీయ జెండాతో పాఠశాల నుంచి మాదలలోని మెయిన్‌సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు నివాళులర్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీసునీత, హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కంచర్ల బుల్లిబాబు, విద్యాకమిటీ చైర్మన్ సాగర్, సభ్యుడు లక్ష్మణ్, హెల్ప్ ఫౌండేషన్ సభ్యులు ఈశ్వరరెడ్డి, నిర్మల్, విష్ణు, పద్మావతి, వ్యాయామ ఉపాధ్యాయురాలు అనూష తదితరులు పాల్గొన్నారు.


