పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలి | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలి

Jul 23 2026 2:18 AM | Updated on Jul 23 2026 2:18 AM

బాపట్లటౌన్‌: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని జిల్లా నేచర్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఆవుల వెంకటేశ్వర్లు కోరారు. జిల్లా నేచర్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ ప్రథమ కార్యవర్గ సమావేశం బుధవారం కమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గాలి, నీరు, అగ్ని భూమి, ఆకాశం పంచభూతాల ప్రకృతి పరిరక్షణ నేచర్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ ధ్యేయమని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, ప్రభుత్వ అనుమతితో ప్రభుత్వ కార్యాలయాల వద్ద మొక్కలను నాటి వాటిని సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. నాలుగువందల పాతిక మొక్కలను సమకూర్చి కమ్మ కళ్యాణమండపం నుంచి వాజ్‌పేయి విగ్రహం వరకు రూ.50 వేల ఖర్చుతో మొక్కలు నాటించారు. మొక్కల దాతకు సహకరించిన తిరువీధుల వాణిను అభినందించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు గురజాల శ్రీనివాసరావు, జీవీఎల్‌ మోహన్‌ గౌడ్‌, గొల్ల ఏకాక్షరి, ఎంసీఏచ్‌ వెంకటేశ్వర్లు, చిల్లర నాగ సురేంద్రబాబు, పొందుగల ప్రసాదరావు పాల్గొన్నారు.

నేచర్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ జిల్లా చైర్మన్‌

వెంకటేశ్వర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement