జ్వరాన్ని అశ్రద్ధ చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

జ్వరాన్ని అశ్రద్ధ చేయొద్దు

Jul 23 2026 1:48 AM | Updated on Jul 23 2026 1:48 AM

జ్వరాన్ని అశ్రద్ధ చేయొద్దు

భయపడొద్దు... జాగ్రత్తలు తప్పనిసరి

గతంలో మాదిరిగా కరోనా వైరస్‌ సోకగానే భయపడాల్సిన పనిలేదు. ప్రస్తుతం వస్తున్న కేసులు ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌కు చెందినవి. వీటి వల్ల ఎలాంటి ప్రాణహాని ఉండదు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్‌ నిర్ధారణ జరిగిన తరువాత వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందటం చాలా ఉత్తమం. తొలుతే గుర్తిస్తే మందులతోనే కరోనాను కట్టడి చేయవచ్చు. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా ఉన్నవారికి మాత్రమే ఇంజెక్షన్లు చేయాల్సి వస్తుంది.

– డాక్టర్‌ వరా అనిల్‌కుమార్‌,

కరోనా నోడల్‌ ఆఫీసర్‌, గుంటూరు జీజీహెచ్‌

జ్వరం సోకగానే భయపడకుండా, అశ్రద్ధ చేయకుండా అది ఏ జ్వరమో నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సలహాలు లేకుండా జ్వరం రాగానే మందులు వాడకూడదు. దీర్ఘకాలిక వ్యాధి బాధితులు, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారితోపాటుగా ప్రతి ఒక్కరూ వైరస్‌ను కట్టడి చేసేందుకు హైప్రోటీన్‌ డైట్‌ తీసుకోవాలి. గుడ్డు, పాలు, పండ్లు, ఆకుకూరలు, చికెన్‌, పప్పుధాన్యాలు, అధిక ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ఉత్తమం. వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు మంచి నిద్ర ప్రతి ఒక్కరికి అవసరం. వైరస్‌ లక్షణాలు ఉన్నాయనే అనుమానం వస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి.

– డాక్టర్‌ కోగంటి కల్యాణ్‌చక్రవర్తి,

ఇన్‌ఫెక్షన్స్‌ స్పెషలిస్టు, గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement