ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

Jul 22 2026 1:29 AM | Updated on Jul 22 2026 1:29 AM

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

గుంటూరు మెడికల్‌: జిల్లాలో మంగళవారం నాటికి ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జీజీహెచ్‌లో జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న మంగళగిరికి చెందిన 53 ఏళ్ల మహిళకు, లాంకు చెందిన 44 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తాజాగా నిర్ధారించారు. బాపట్ల జైలులో ఉన్న 21 ఏళ్ల యువకుడికి సైతం కరోనా ఉన్నట్లు నిర్ధారించారు. జిల్లాలో తొలుత కరోనా పాజిటివ్‌ కేసులు మంగళగిరి ఎయిమ్స్‌ వైద్యులు ఈ నెల 16న నిర్ధారించారు. మంగళగిరికి చెందిన 18 ఏళ్ల యువతికి, నవులూరుకి చెందిన 27 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. తొలుత కరోనా పాజిటివ్‌ సోకినట్లు నిర్ధారించిన మంగళగికి కేసుకు సంబంధించిన కుటుంబ సభ్యులకు మంగళవారం కరోనా సోకినట్లు నిర్ధారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement