యువ వైద్యుడి ప్రాణాలు తీసిన కల్వర్టు | - | Sakshi
Sakshi News home page

యువ వైద్యుడి ప్రాణాలు తీసిన కల్వర్టు

Jul 21 2026 1:36 AM | Updated on Jul 21 2026 1:36 AM

● ద్విచక్ర వాహనం అదుపుతప్పి కల్వర్టులోకి పల్టీ ● డాక్టర్‌ మృతి... మరొకరికి తీవ్రగాయాలు

వేటపాలెం: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కల్వర్టులోకి పల్టీ కొట్టిన ఘటనలో యువ పీజీ వైద్యుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఓడరేవు నుంచి రామాపురం సముద్రతీరం కల్వర్టు వద్ద ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బాపట్ల బీమావారిపాలెం చెందిన డాక్టర్‌ లేళ్ల వెంకట అనిరుద్దీన్‌ (24) తన స్నేహితుడితో కలసి ఆదివారం రామాపురం బీచ్‌కు వచ్చారు. ఆనందంగా గడిపిన తర్వాత బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. రామాపురం నుంచి ఓడరేవు వెళ్లే రహదారి మధ్యలో మరమ్మతులో ఉన్న కల్వర్టు వద్ద బైక్‌ అదుపుతప్పింది. కల్వర్టులో పల్టీ కొట్టింది. అనిరుద్దీన్‌ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని 108లో చీరాల అసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement