భట్టిప్రోలు(వేమూరు): డ్రైనేజీ శాఖ అధికారులు గుర్రపు డెక్క తొలగించే కార్యక్రమం వేగవంతం చేయాలని వైఎస్సార్ సీపీ వేమూరు సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు పేర్కొన్నారు. భట్టిప్రోలు కనగాల కెనాల్‌లో గుర్రపు డెక్క ఏళ్ల తరబడి పేరుకు పోయి పంట పొలాలు దెబ్బతినడం జరుగుతుంది. గుర్రపు డెక్క తొలగించేందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం శనివారం ఆయన అదేపల్లి కనగాల కెనాల్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువల్లో మళ్లీ భారీగా గుర్రపు డెక్క పెరిగి పోవడంతో సాగునీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడిందన్నారు. రైతులకు ఇప్పటికి అందాల్సిన సాగునీరు ఆలస్యమైందన్నారు. గుర్రపు డెక్క తొలగింపుపై వారం రోజులుగా డ్రైయినేజీ శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తే మళ్లీ దీక్ష చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. గతేడాది గుర్రపు డెక్క తొలగింపుపై అదేపల్లి కనగాల డ్రైనేజీపై జల దీక్ష చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది కూడా గుర్రపు డెక్క తొలగించక పోతే దీక్ష చేపట్టడం జరుగుతుందన్నారు. దీంతో అధికారులు స్పందించి శని వారం గుర్రపు డెక్క తొలగించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పడమటి శ్రీనివాసరావు, టౌన్ ప్రెసిడెంట్ కుందేటి రమేష్, పెద్ద బుజ్జి, బొల్లెదు ప్రతాప్, వేల్పూరి చిన్నారి, వెంకట్రామయ్య, మోర్ల కోటయ్య, సయ్యద్ నభీ, రత్నబాబు, అంకబాబు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ వేమూరు సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు


