ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులుగా మారుటూరి బాపట్ల: బాపట్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా మారుటూరి రాఘవేంద్రరావును నియమిస్తూ సంఘం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సంఘం కార్యాలయంలో నూతన కమిటీని నియమించారు. అధ్యక్షులుగా చీరాలకు చెందిన మారటూరి రాఘవేంద్రరావు, ప్రధాన కార్యదర్శిగా బాపట్లకు చెందిన నాగవరపు పవన్‌కుమార్‌ను నియమించారు. సమావేశంలో ఐవీఎఫ్ రాష్ట్ర రాజకీయ చైతన్య కమిటీ చైర్మన్ వెల్లంపల్లి సత్యనారాయణ, ఐవీఎఫ్ బాపట్ల జిల్లా కోశాధికారి కోళ్లపూడి శివనారాయణ, బాపట్ల జిల్లా కమిటీ కోశాధికారి గుప్తా, తటవర్తి బ్రహ్మం, బూర్లే అనిల్‌కుమార్, గుండ శ్రీనివాసరావు, ఊటుకూరు వెంకటేశ్వర్లు, నాగవరపు నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతానికి
కార్మికుడు బలి మార్టూరు: విద్యుదాఘాతంతో ఓ గ్రానైట్ కార్మికుడు మృతి చెందిన ఘటన శుక్రవారం మార్టూరులో జరిగింది. అందిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం మయూర్ గంజ్ జిల్లా భోలా గడియ గ్రామానికి చెందిన అనంత్ కిస్క్ (21) గత కొంతకాలంగా మార్టూరులోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఫ్యాక్టరీలో విద్యుత్ మరమ్మతులు చేస్తున్న క్రమంలో వారికి సహాయంగా ఇనుప నిచ్చెన మోసుకుని వెళుతున్న అనంత్ కిస్క్ పైన ఉన్న హై టెన్షన్ తీగలు నిచ్చెనకు తగలడంతో షాక్ తగిలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అనంత్‌తో పాటు స్వల్పంగా గాయపడిన మరొక కార్మికుడితో కలిపి ఇద్దరిని స్థానికులు చిలకలూరిపేట ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. పరీక్షించిన వైద్యులు అనంత్ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మార్టూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సబ్ జైలు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మృతి భార్యాభర్తలను
కలిపిన శక్తి టీం న్యాయవాదులకు
ఈ ఫైలింగ్‌లో మెళకువలు గుంటూరులీగల్: జిల్లా కోర్టులోని న్యాయవాదులకు ఈ–ఫైలింగ్ విధానం, అందులో పాటించాల్సిన ముఖ్యమైన మెళకువలు, సాంకేతిక అంశాలపై శుక్రవారం ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఆగస్టు 1వ తేదీ నుండి బెయిల్ పిటిషన్లు, క్రిమినల్ అప్పీళ్లకు ఈ–ఫైలింగ్ విధానం తప్పనిసరి అవుతుందని తెలిపారు. ఈ–ఫైలింగ్ విధానం ద్వారా న్యాయ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందన్నారు.
రేపల్లె: రేపల్లె సబ్ జైలులో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన మన్నెం వెంకటేశ్వరరావు(59) మృతి చెందారు. సబ్‌జైల్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఉదయం వరకు నిద్రలేవక పోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇటీవల రిమాండ్ ఖైదీ బీముడు అజిత్ కుమార్ పరారీ ఘటన నేపథ్యంలో వెంకటేశ్వరరావును అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సహోద్యోగులు, సిబ్బంది ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. మృతుడు వెంకటేశ్వరరావుకు భార్య పార్వతి, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
చీరాల: ఇంటి నుంచి చెప్పకుండా వచ్చిన భార్యను వెతుక్కుంటూ చీరాల వచ్చిన భర్తకు సహకరించి భార్యాభర్తలను కలిపారు. ఈ ఘటన శుక్రవారం చీరాలలో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు శక్తి టీం చీరాల రైల్వేస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడకు చెందిన మేరి, ఏసోబు ఇద్దరు భార్యాభర్తలు. ఇద్దరూ గొడవపడగా భార్య మేరి ఇంటిలో చెప్పకుండా రెండు రోజులు క్రితం రైలు ఎక్కి చీరాలకు వచ్చింది. భార్యను వెతుక్కుంటూ శుక్రవారం చీరాలకు రాగా రైల్వేస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న శక్తి టీం సభ్యులకు విషయాన్ని వివరించారు. ఒన్‌టౌన్ సీఐ సోమశేఖర్‌కు విషయాన్ని తెలుపగా శక్తి టీం సభ్యులు, మహిళా ఏఎస్‌ఐ శివకుమారి, కానిస్టేబుల్ సుబ్బారావు, సునీత అందరూ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద గల పాడుపడిన రైల్వే క్వార్టర్స్ వద్ద చెట్టు కింద నిద్రిస్తున్న ఆమెను గుర్తించి భర్తకు అప్పగించారు. అనంతరం ఇద్దరితో మాట్లాడి విజయవాడ వెళ్లే రైలు ఎక్కించారు.