మేడికొండూరు : జగనన్న బాటలోనే పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు నాయకుడికి కుటుంబ సభ్యులుగా అండగా ఉంటామని మేడికొండూరు జెడ్పీటీసీ సభ్యులు కందుల సిద్ధయ్య జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్ సయ్యద్ హబీబుల్లా, అవుతు శ్రీనివాస్ రెడ్డి, బుర్ర సుబ్బారెడ్డి పాములపాటి జయరావు, రాజేంద్రప్రసాద్ అన్నారు. మేడికొండూరు గ్రామానికి చెందిన జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించాడు. శుక్రవారం వీరంతా బాజీ కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన బాజీ రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమని మేడికొండూరు మండలంలో పార్టీకి తీరని లోటు అని అన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడికొండూరు మండల ఉపాధ్యక్షులు ఉడతా ప్రభాకర్, చావుపాటి బాజీ షేక్ హుస్సేన్ మీరా, జలంధర్ బాజీ, మన్నవ బ్రహ్మయ్య, జోకర్ గఫార్, షేక్ సుభాని, పాల్గొన్నారు.


