చిత్తశుద్ధి జాడెక్కడ? గుర్రపుడెక్కతో రైతులకు కోలుకోలేని నష్టం వేమూరు: అధిక వర్షాల సమయంలో గుర్రపు డెక్క ఏపుగా పెరుగుతోంది. దీని వల్ల కాలువల్లో నీరు నిలిచి పొంగిపొర్లుతోంది. సాగు చేసిన పంటలు దెబ్బ తింటున్నాయని రైతులు వాపోతున్నారు. రేపల్లె డ్రైనేజీ కాలువల్లో జంపని వద్ద గుర్రపు డెక్క ఆకు అధికంగా పెరిగి పోయింది. వర్షాలు రాక ముందే దీనిని తొలగించాల్సి ఉంది. గత ఏడాది వర్షాలకు ముందు గుర్రపు డెక్క తొలగించక పోవడంతో జూలై నెలలో కురిసిన వర్షాల వల్ల నీరు బయటకు వెళ్లక వెద సాగు దెబ్బతింది. జంపని గ్రామంలో పశువులు కాలువల్లో పడి మృతి చెందిన ఘనలున్నాయి. గతేడాది డ్రైనేజీ నీరు వెళ్లక పోవడంతో భట్టిప్రోలు మండల కేంద్రంలో వెదసాగు పొలాలు పూర్తిగా మునిగి పోయాయి.
వరికూటి సుదీర్ఘ పోరాటం
ఈ సమస్యపై రైతులు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబును ఆశ్రయించగా.. ఆయన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. కానీ అధికారులు పట్టించుకోక పోవడంతో జూలై 31వ తేదీన డ్రైనేజీ కాల్వల్లో జల దీక్ష కార్యక్రమం చేపట్టారు. దీంతో అధికారులు ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం భట్టిప్రోలు గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారులు గుర్రపు డెక్క తొలగించేందుకు ముందుకు రాకపోవడంతో, రేపల్లె డ్రైనేజీ కార్యాలయం వద్ద దీక్ష చేపట్టారు. వెంటనే పోలీసులు అశోక్‌బాబును అరెస్టు చేసి ఆ ప్రాంతంలో లాఠీచార్జి చేశారు. దీంతో పోలీసు స్టేషన్‌లోనే ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పోలీసులు రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొని వెళ్లారు. గుర్రపు డెక్క తొలగించే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆరోగ్యం క్షీణించడంతో రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు వచ్చి డ్రైనేజీ అధికారులతో మాట్లాడి తొలగిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆయన దీక్ష విరమించుకున్నారు. ఈ ఏడాది కూడా గుర్రపు డెక్క తొలగించక పోతే ఆందోళన చేస్తామని వరికూటి హెచ్చరించారు.
ఏటా మొద్దు నిద్ర వీడని చంద్రబాబు సర్కార్
తొలగింపు కోసం పోరాడినా ఫలితం శూన్యం
అన్నదాతల సమస్యల పరిష్కారంలో అదే నిర్లక్ష్యం
గుర్రపు డెక్క తొలగించలేదు
నీటిపారుదల అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. జంపని వద్ద రేపల్లె డ్రైనేజీ కాల్వల్లో గుర్రపు డెక్క ఇంత వరకు తొలగించలేదు. టీడీపీ ప్రభుత్వం స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేస్తాం.
దెబ్బతిన్న వెద సాగు
గతేడాది గుర్రపు డెక్కను డ్రైనేజీ అధికారులు తొలగించక పోవడంతో వర్షఱపు నీరు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వెద సాగు నీట మునిగిపోయింది. ఈ ఏడాదైనా డ్రైనేజీ అధికారులు గుర్రపు డెక్క వెంటనే తొలగించాలి.
గుర్రపుడెక్కతో రైతులకు కోలుకోలేని నష్టం
ఏటా గుర్రపు డెక్క సమస్య రైతులకు సమస్యలు తెచ్చిపెడుతోంది. దీనివల్ల పంటలు దెబ్బతింటున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదు. రేపల్లె డ్రైనేజీ కాలువల్లో గుర్రపు డెక్క తొలగించకుంటే ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు. తమ సంక్షేమంపై చిత్తశుద్ధి లేని చంద్రబాబు పాలనలో ప్రతి సంవత్సరం ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.
– ఈపూరు బాబురావు, పోతుమర్రు
–ఆల్లూరు యోనబాబు, జంపని