జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ
గుంటూరు వెస్ట్: మై భారత్ పోర్టల్‌లో విద్యార్థులు, యువత నమోదును వేగంగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. నేటితో ముగియనున్న ఇంటెన్సివ్ రిజిస్ట్రేషన్ – అవగాహన డ్రైవ్ పురోగతిపై మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించాలని, ప్రతి కళాశాలలో మై భారత్ నోడల్ అధికారులను నియమించి, మై భారత్ చాప్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం జేసీతోపాటు అధికారులు మై భారత్ పోర్టల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మేరా యువ భారత్ గుంటూరు జిల్లా ఉప సంచాలకులు దేవిరెడ్డి కిరణ్మయి, స్కిల్ డెవలప్‌మెంట్ జిల్లా అధికారి సంజీవరావు, జిల్లా ఎన్‌ఎన్‌ఎస్ ప్రోగ్రాం అధికారి సునీల్, స్టెప్ మేనేజర్ రాధిక తదితర అధికారులు పాల్గొన్నారు.


