సర్‌పోతుందా.. గడువు! | - | Sakshi
Sakshi News home page

సర్‌పోతుందా.. గడువు!

Jul 15 2026 1:52 AM | Updated on Jul 15 2026 1:52 AM

బుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2026 పులిచింతల సమాచారం

న్యూస్‌రీల్‌

ఓట్లు పోకుండా చూడాలి

24 వరకు సర్‌ ప్రక్రియ గడువు పొడిగించిన ఈసీ నియోజకవర్గంలో 99.28 శాతం మేర డిజిటలైజేషన్‌ పూర్తి

బాపట్ల
బుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2026

అచ్చంపేట : ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 30.9103 టీఎంసీలు. ఎగువ ప్రాంతాల నుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా... దిగువకు అంతే నీరు వదులుతున్నారు.

సర్‌ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినా, పలు వర్గాల ఓట్లు గల్లంతవుతాయనే ఆందోళన నెలకొంది. నెల రోజుల్లో ఓటరు వివరాలను డిజిటలైజేషన్‌ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గడువులోపు సిబ్బంది సాధ్యమైనంత మేర పూర్తి చేశారు. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్‌ సర్‌ ప్రక్రియకు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించడంతో, మిగిలిన ఫారాల డిజిటలైజేషన్‌ పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.

చీరాల: చీరాల నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాల్లో మొత్తం 218 పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. మొత్తం 2,03,641 మంది ఓటర్లు ఫారాలు అందించగా, వీరిలో 2,02,167 ఓట్లను డిజిటలైజేషన్‌ పూర్తి చేశారు. ఇంకా 1,474 ఓటర్ల ఫారాలను డిజిటలైజేషన్‌ చేయాల్సి ఉంది. మంగళవారం నాటికి మొత్తం 99.28 శాతం నమోదైంది. ఒక్కో బీఎల్‌ఓకు రాజకీయ పార్టీల నుంచి ఒక్కో బీఎల్‌ఏను కేటాయించారు. బీఎల్‌ఏల పనితీరును బీఎల్‌ఓలు పరిశీలిస్తారు. బీఎల్‌ఓ ద్వారా పొందిన రెండు రకాల ఫారాల్లో ఓటరు తన వివరాలను నింపి తిరిగి అందజేయాలి. గత నెల 15న ప్రారంభమైన సర్‌ ప్రక్రియ ఈనెల 14వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే ఎక్కువ మంది ఓటర్ల వివరాల డిజిటలైజేషన్‌ పూర్తి కాకపోవడంతో పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సర్‌ కార్యక్రమాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేశాయి.

వారి ఓట్లకు గండి?

కొంతమంది ఓటర్లకు సర్‌ ప్రక్రియపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రక్రియ నెమ్మదిగా సాగింది. గత రెండు దఫాలుగా ఓటు వేసినా, 2002 నాటి సర్‌ వివరాలను అందించాలనే నిబంధన ఉండడంతో ఎక్కువ మంది ఓటు హక్కును కోల్పోతున్నారు. అప్పటి వివరాలు లభించకపోవడం, వేరే ప్రాంతం నుంచి ఇక్కడకు వలస రావడం, స్థిర నివాసం లేకపోవడం వంటి కారణాలతో ఎంతో మంది ఓటు హక్కును కోల్పోతామనే ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా మైనార్టీలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారు ఎక్కువ మంది ఉన్నారు. వీరికి స్థానికంగా ఓటు హక్కు ఉన్నా, 2002లో ఎక్కడ ఓటు వేశారనే విషయంపై స్పష్టమైన అవగాహన లేదు. చీరాల మున్సిపాలిటీలోని శివారు వార్డుల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వలస వచ్చిన వారు ఎక్కువ మంది ఉన్నారు. తూర్పు రెడ్డి, తూర్పు కాపు సామాజికవర్గాలకు చెందిన వారు ఎన్నో ఏళ్లుగా చీరాలకు వచ్చి స్థిరపడ్డారు. పట్టణంలోని 27, 28 వార్డుల్లో తూర్పు రెడ్డి సామాజికవర్గానికి చెందిన 1,000 ఓట్లు ఉన్నాయి. అలాగే 23, 24 వార్డుల్లో తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన 800 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి ఇక్కడ, అక్కడ ఓట్లు ఉండడంతో, వారిలో ఎక్కువ మంది తమ సొంత ప్రాంతంలోనే ఓటు కొనసాగించడానికి మొగ్గుచూపుతున్నారు. ఈ వార్డుల్లో ఓట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. మైనార్టీ వర్గాలకు చెందిన ఎక్కువ మందికి గత సర్‌ కార్యక్రమంలో ఓటు లేకపోవడంతో, వారి ఓట్లు కూడా తగ్గే అవకాశం ఉందని సమాచారం.

స్పెషల్‌ డ్రైవ్‌లు.. హెల్ప్‌ డెస్క్‌లు..

సర్‌ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం కదిలింది. జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. బీఎల్‌ఓలతో మాట్లాడి సర్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. అధికారులకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు అందిస్తూ సర్‌ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేసేందుకు ప్రయత్నించారు. మున్సిపాలిటీల్లో ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌లు, స్పెషల్‌ డ్రైవ్‌లు ఏర్పాటు చేశారు. ఓటర్లు పూర్తి చేసిన ఫారాలు అందించేందుకు వీలుగా చీరాల మున్సిపాలిటీలో నాలుగు ప్రాంతాల్లో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేశారు.

నియోజకవర్గంలో జరుగుతున్న సర్‌ ప్రక్రియపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌బాబు పార్టీ నాయకులతో మాట్లాడారు. పార్టీకి సంబంధించి బీఎల్‌ఏలు నిరంతరం బూత్‌లలో బీఎల్‌ఓలకు అందుబాటులో ఉంటూ అర్హులందరికీ ఓటు హక్కు అందేలా చూడాలన్నారు. బీఎల్‌ఏలు నిబద్ధతతో పనిచేయాలన్నారు. పోలింగ్‌ బూత్‌ల పరిధిలో డబుల్‌ ఎంట్రీ ఓట్లు తొలగించి, అర్హులైన వారి ఓట్లు పోకుండా చూడాలన్నారు. అలాగే గత మూడు రోజులుగా ఆయన నియోజకవర్గంలోని పలు సచివాలయాల్లో పర్యటిస్తూ సర్‌ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సిబ్బంది కూడా నిష్పక్షపాతంగా వెరిఫికేషన్‌ ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటరు జాబితాలో కొనసాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement