బాపట్ల: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది కుటుంబాలను ఆదుకోవడంలోనూ, వారి సంక్షేమాన్ని కాపాడటంలోనూ బాపట్ల జిల్లా పోలీస్ శాఖ మరోసారి మానవీయతను చాటుకుంది. వేమూరు పోలీస్ స్టేషన్‌న్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తూ మృతి చెందిన కె. అశోక్‌వర్ధన్ కుటుంబానికి పోలీస్ శాలరీ ప్యాకేజీ, ఇన్స్యూరెన్స్ విభాగాల ద్వారా మంజూరైన రూ. 40 లక్షల 25 వేల ఆర్థిక సహాయాన్ని సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ స్వయంగా అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది త్యాగాలు వెలకట్టలేనివని, వారి కుటుంబాలకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు జిల్లా పోలీస్ యంత్రాంగానికి, ముఖ్యంగా జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కృష్ణంరాజు, ఏఓ అద్దంకి వెంకటేశ్వర్లు, రిజర్వ్ ఇన్‌న్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీకాంత్, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రమేష్, న్యూ ఇండియా ఇన్స్యూరెన్స్ మేనేజర్ సుబ్బారావు, జమీర్ తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


